E-Paper
Advertisement

Ram Charan New Movie: రామ్ చరణ్ కొత్త మూవీ ప్రారంభం.. టైటిల్ ఇదేనా..!

Ram Charan New Movie: రామ్ చరణ్ కొత్త మూవీ ప్రారంభం.. టైటిల్ ఇదేనా..!
Advertisement

 

ram charan and janhvi kapoor movie update
RC16

Ram Charan RC16 (Latest movies in tollywood): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీ షూటింగ్ షూరూ అయ్యింది. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభోత్సం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, స్టార్ డైరెక్టర్లు శంకర్, సుకుమార్, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ పాల్గొన్నారు. ఫిల్మ్ యూనిట్ కు విషెస్ చెప్పారు.

Advertisement

రామ్ చరణ్ కొత్త మూవీకి బుచ్చిబాబు డైరెక్టర్. ఉప్పెన మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు కొంతకాలం క్రితమే చెర్రీకి కథ చెప్పాడు. స్టోరీ లైన్ నచ్చడంతో చరణ్ ఓకే చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూజా కార్యక్రమంలోనూ ఇదే అంశాన్ని చెర్రీ చెప్పాడు. కథ తనకు ఎంతో నచ్చిందన్నాడు. ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చతుందన్నాడు.

ఉప్పెన చిత్రం బుచ్చిబాబుకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. బుచ్చిబాబుకు కూడా ఇదే తొలి మూవీ. ఆ తర్వాత అతడు మరో సినిమా దర్శకత్వం వహించలేదు. రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్నాడు.

Advertisement

Also Read: “గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం”.. పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ క్రీడా నేపథ్యంలో ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పల్లెటూరులో కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక జాన్వీకపూర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా RC16 ను నిర్మిస్తున్నాయి. పెద్ది అనే టైటిల్ పెడతారని టాక్ . మెగా పవర్ స్టార్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. దేవర మూవీలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇద్దరు కాల్షీట్లు కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. వెంటనే షూటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×