BigTV English

shocking facts about watermelon: వామ్మో.. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెడుతున్నారా?.. అయితే జాగ్రత్త..

shocking facts about watermelon: వామ్మో.. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెడుతున్నారా?.. అయితే జాగ్రత్త..
shocking facts about watermelon
shocking facts about watermelon

shocking facts about watermelon: ఈ ఏడాది వేసవికాలం మొదలు కాకముందు నుండే ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఇక సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఉదయం 7 గంటల నుండే సూర్య దేవుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకుంనేందుకు సీజన్ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఎండలో ఆఫీసులు, పనుల పేరిట తిరిగే చాలా మంది పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లను ఎక్కువగా తినేస్తున్నారు. ఎండలో తిరిగి చెమట ద్వారా బాడీలోని నీటి శాతం తగ్గిపోతుంటుంది. దీంతో బాడీ డీహైట్రేడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి.


పుచ్చకాయలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీంతో వేసవికాలంలో శరీరంలో నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు ఇది వంద శాతం ఉపయోగపడుతుందనే చెప్పాలి. వేసవికాలంలోనే కాకుండా శరీర బరువును తగ్గించుకోవాలని ప్రయత్నించే వారికి పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. పుచ్చకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ తాగడంతో బరువును తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు పుచ్చకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫలితంగా పుచ్చకాయ శరీరంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.

ఈ కారణాల వల్ల పుచ్చకాయలను చాలా మంది తమ ప్రతి రోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటారు. అయితే వేసవికాలం కాబట్టి పండ్ల వ్యాపారులు కూడా ఆఫర్ల పేరిట ఎక్కువగా అమ్మకాలు జరుపుతున్నారు. అతి తక్కువ ధరకే అమ్మకాలు చేస్తుంటారు. దీంతో చౌకగా వస్తున్నాయని చాలా మంది రెండు, మూడు పుచ్చకాయలను ఒకేసారి కొనుగోలు చేసుకుని వారం తరబడి తినేస్తున్నారు. అయితే పుచ్చకాయలను నిలువ చేసుకుని తినే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. ఒకేసారి తెచ్చుకున్న రెండు, మూడు పుచ్చకాయలను బయటపెడితే పాడైపోతాయనే భయంతో ఫ్రిడ్జిలో పెట్టి తినేస్తున్నారు.


పుచ్చకాయలను ఫ్రిడ్జిలో నిల్వ చేసుకుని తినడం ద్వారా ఆరోగ్యానికి హానీ కలుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. పుచ్చకాయను ఫ్రిడ్జిలో స్టోర్ చేయడం ద్వారా అందులో ఉండే పోషక విలువలు తగ్గుతాయి. అందులోను పుచ్చకాయను సగం కోసి ఫ్రిడ్జిలో పెట్టుకుని తినడం మరింత హానికరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టుకుని తింటే ఫుడ్ పాయిజన్ భారిన పడే అవకాశం ఉంటుందట. అందువల్ల పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టుకుని తినడం మంచిది కాదని చెబుతున్నారు.

పుచ్చకాయను ఎలా తీసుకోవాలి?

పుచ్చకాయను ఎప్పటికి అప్పుడు ఫ్రెష్ గా తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ రోజులు నిలువ ఉంచుకుని తినడం మంచిది కాదని చెబుతున్నారు. ఈ క్రమంలో పుచ్చకాయలను ఫ్రిడ్జిలో కంటే తీసుకువచ్చిన వెంటనే నీటిలో ఓ అరగంట పాటు ఉంచాలని అంటున్నారు. అందువల్ల పుచ్చకాయలోని నీటి శాతం మరింత పెరుగుతుందట. ఫ్రిడ్జిలో స్టోర్ చేసుకుని తినడం కంటే ఈ విధంగా నీటిలో కాసేపు ఉంచి ఎప్పటికి అప్పుడు ఫ్రెష్ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×