BigTV English

Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్

Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్


SC Granted Bail to Abhishek in Delhi liquor case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో.. ఆమెకు చికిత్స చేయించేందుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు 4 వారాలు అభిషేక్ కు బెయిల్ మంజూరు చేస్తూ.. నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని పేర్కొంది. అలాగే అభిషేక్ పాస్ పోర్టును సరెండర్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది.

Also Read : యూజర్లకు బిగ్ అలర్ట్.. పర్సనల్ డేటా చోరి.. ప్రభుత్వం హెచ్చరిక


అలాగే అభిషేక్ పాస్ పోర్టును సరెండర్ చేసి, మొబైల్ నంబర్ ను ఈడీ అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అనారోగ్యంతో ఉన్న భార్యకు హైదరాబాద్ లో మాత్రమే చికిత్స అందించాలని షరతులు విధించింది. కాగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అభిషేక్ బోయినపల్లిని సీబీఐ 2022 అక్టోబర్ 10న అరెస్ట్ చేసింది. 19 నెలలుగా జైలులోనే ఉన్న అభిషేక్ కు తాజాగా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి తో పాటు అరుణ్ రామచంద్ర పిళ్ళై రాబిన్ డిస్టిలరీస్ కు డైరెక్టర్లుగా ఉన్నారు. 2022 జూన్ లోనే రాబిన్ డిస్టిలరీస్ ను ఏర్పాటు చేసి.. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో కంపెనీను నమోదు చేశారు. తన అరెస్ట్ తర్వాత.. అభిషేక్ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ దే కీలక పాత్ర అని సీబీఐ తేల్చింది. సౌతాలాభి పేరుతో అభిషేక్ లావాదేవీలు కొనసాగించినట్లు గుర్తించింది సీబీఐ.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×