BigTV English

Webb Telescope: 700 మిలియన్ ఏళ్లనాటి గ్యాలక్సీలను కనుగొన్న టెలిస్కోప్..

Webb Telescope: 700 మిలియన్ ఏళ్లనాటి గ్యాలక్సీలను కనుగొన్న టెలిస్కోప్..

Webb Telescope:ఇప్పటికే స్పేస్‌ను స్టడీ చేయడానికి ఎన్నో స్పేస్ మిషిన్లు, రాకెట్లు, టెలిస్కోప్‌లు అంతరిక్షంలో తిరుగుతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికంటే మెరుగ్గా ఉండాలని శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను తయారు చేశారు. ఇప్పటికే ఈ వెబ్ టెలిస్కోప్ వల్ల అంతరిక్షం గురించి ఎంతో సమాచారం శాస్త్రవేత్తలు అందింది. తాజాగా మరో కొత్త విషయాన్ని కూడా వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గమనించారు.


నక్షత్ర మండలం ఎన్నో గ్యాలక్సీలు ఉంటాయి. వాటన్నింటి గురించి పూర్తిగా స్టడీ చేయాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అలా స్టడీ చేసే ప్రక్రియలో కూడా ఎన్నో కొత్త గ్యాలక్సీలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతరిక్షంలో అదే జరుగుతోంది. ఇప్పుడు నక్షత్ర మండలంలో ఉన్న గ్యాలక్సీలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ ఉండగానే.. కొత్త గ్యాలక్సీలను వారు కనుగొన్నారు. కనీసం ఊహకు అందనంత పెద్దగా యూనివర్స్‌లో భూమికి చాలా దూరంగా కొత్త గ్యాలక్సీలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది.

వెబ్ టెలిస్కోప్‌లో కనిపించిన గ్యాలక్సీల గురించి శాస్త్రవేత్తలు స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఇవి విశ్వం ఏర్పడిన మొదటి 700 మిలియన్ సంవత్సరాలలోనే ఏర్పడిన ఆరు గ్యాలక్సీలు అని వారు చెప్తున్నారు. ఆ గ్యాలక్సీలు అన్ని 100 రెట్లు పెద్దగా ఉన్నాయని వారు గుర్తించారు. మామూలుగా కాస్మాలజీ ప్రకారం గ్యాలక్సీలు ఉండాల్సిన దానికంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయని వారు చెప్తున్నారు. ఈ ఆరు గ్యాలక్సీలను కలిపితే విశ్వం కంటే పెద్దగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


2022 జులైలోని జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. దూరంగా ఉన్న ఈ కాస్మోలను గుర్తించింది. సమయం గడుస్తున్నకొద్దీ ఇవి ఏంటో శాస్త్రవేత్తలకు అర్థమయ్యింది. ఇవి చాలా ప్రకాశవంతంగా, ఎర్రగా ఉన్నాయని వారు గుర్తించారు. ఇప్పటివరకు ఇవి చాలా దూరంలో ఉన్నాయన్న విషయం మాత్రమే శాస్త్రవేత్తలకు తెలిసింది. ఇప్పుడు అవి సరిగ్గా ఎంత దూరంలో ఉన్నాయని విషయాన్ని కనుక్కోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ గ్యాలక్సీ నుండి వెలువడే లైట్‌ను బట్టి దాని వేవ్‌లెన్త్‌ను లెక్కించి.. అవి ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.

ఈ గ్యాలక్సీలు సూర్యుడికంటే 10 బిలియన్ రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా అందులో ఒక గ్యాలక్సీ.. 100 బిలియన్ సూర్యుళ్లను కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉండే అవకాశం ఉందని వారు అన్నారు. ఇలాంటివన్నీ నక్షత్ర మండంలో ఉంటాయని గుర్తిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే వచ్చే ఏడాది వరకు వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

America China:ఆ విషయంలో అమెరికా, ఇండియా మధ్య ఒప్పందం..

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×