BigTV English

RC16 : RC16 … చరణ్‌ని డైరెక్ట్ చేయనున్న స్టార్ డైరెక్టర్

RC16 : RC16 … చరణ్‌ని డైరెక్ట్ చేయనున్న స్టార్ డైరెక్టర్

RC16 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RRR తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌లో చరణ్ సినిమా చేస్తారనే అనౌన్స్ వచ్చింది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రామ్ చరణ్‌ RC16ని డైరెక్ట్ చేయబోయేదెవరనే దానిపై పలు ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే స్టార్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తన ఫ్రెండ్స్ క్లబ్‌లో చేసిన కామెంట్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే ఆర్ఆర్ఆర్ మేకింగ్ సమయంలోనే డైరెక్టర్ సుకుమార్.. రామ్ చరణ్‌పై కొత్త సినిమా షూటింగ్‌ను చేశారట. అది కూడా యాక్షన్ పార్ట్. RRR మూవీ కోసం రామ్ చరణ్ పెంచిన బాడీ లుక్ నచ్చిన సుకుమార్ అదే సమయంలోనే షూటింగ్ చేసేశారట.


RRR ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి ఓ సందర్భంలో చరణ నెక్ట్స్ మూవీ సుకుమార్‌తో ఉంటుందని, అది కూడా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అని ఆ యాక్షన్ పార్ట్ తన RRR ఇంట్రడక్షన్ కంటే అదిరిపోతుందని చెప్పారు. ఇప్పుడు సాబు సిరిల్ చేసిన కామెంట్స్.. రాజమౌళి చెప్పిన మాటలకు లింకు కుదురుతుందని, శంకర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ సుకుమార్‌తోనే సినిమా చేస్తారని అంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×