Big Stories

Om Namah Shivaya Mantra : ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే కలిగే లాభాలివే

Om Namah Shivaya Mantra : ప్రణవ పంచాక్షరీ మంత్రం ఎంత మహిమాన్వితమో, ఎంత మహత్తరదైనదో ఆ పరమ రహస్యాన్ని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడుకి చెప్పాడు. భక్తితో శ్రద్ధతో మంత్రాన్ని జపిస్తే సర్వశక్తులు కలిగిన సమానమైన వాళ్లు అవుతారు. శివనామం తలిస్తే పాపాలను పోతాయని శివపురాణం చెబుతోంది.

- Advertisement -

ఈమంత్రాన్ని జపించే సంఖ్యను బట్టి ఫలితాలు ఉంటాయి. ప్రణవపంచాక్షరీ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపిస్తే సర్వపాపాలు నశించిపోతాయి. అంతేకాదు అలా జపించిన వాళ్లు అతల లోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న 14లోకాలలోను ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. కోటి సార్లు మంత్రాన్ని జపం చేస్తే బ్రహ్మతో సమానమైన వారవుతారు. 2కోట్ల సార్లు మంత్రాన్ని జపిస్తే విష్ణుపదమను పొందవచ్చు.

- Advertisement -

3కోట్ల సార్లు మంత్రాన్ని జపిస్తే రుద్రపదమును , 4కోట్లు సార్లు మంత్రాన్ని జపిస్తే మహేశ్వర లోకమును పొందవచ్చు. శివనామ స్మరణ చేసేవాళ్లు పరమానందాన్ని అనుభవించి సాక్షాత్తూ శివుడిగా ప్రకాశిస్తాడని శివపురాణం చెబుతోంది. మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో జపిస్తే కోరికలు శ్రీఘముగా నెరవేరతాయి.

ఇంత మహత్తు ఉంది కాబట్టే అక్షరాభ్యాసం ప్రారంభించే ముందు ఓం నమః శివాయ సిద్ధం నమః అనే శివ మంత్రాన్ని రాయిస్తారు.ఆనాటి నుంచి నేటి వరకు ఇదే సంప్రదాయం భారతదేశంలో కొనసాగుతోంది. ఇతర ఏ దేవుళ్ల నామంతోను అక్షరాభ్యాసమును ప్రారంభించరు. ఇదే శివనామం ఘనత.

శి అంటే మంగళం, వ అంటే అనుగ్రహించే వాడని అర్థం.సమస్త దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది. కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టిన వారికి కలిగే ముక్తి శివనామ స్మరించే వారికి కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పారు. ఎప్పుడూ శివనామం పలికే వాళ్లకు శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు. ఏ పనిచేయాలన్న నియమాలు ఉంటాయి. కానీ శివనామం పలికేందుకు ఎలాంటి నియమం ఉండదు. ఎందుకంటే ఓ యజ్ఞం చేస్త్తే అది సరిగా చేయకపోతే ఫలితం ఉండదు. ఈ భూమ్మిద ఉత్కృష్ణ ప్రాణులు మూడు
మొదటిది కోతి, రెండోది ఏనుగు, మూడోది మనిషి. మొదటి రెండు కన్నా గొప్ప జన్మ మనిషి జన్మ. ప్రపంచ కోటి ప్రాణుల్లో నోరు తెరిచి
మాట్లాడే కలిగిన స్వరపేటిక ఉన్న జీవి మనిషి. అందుకే ఆ వరమిచ్చిన దేవుడి నామం పలికితే మనిషి జన్మకి సార్థకత చేకూరుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News