BigTV English
Advertisement

Imran khan : నా అన్వేష్ వ్యభి*చారం కామెంట్స్… న్యాయం చెయ్యాలంటూ సీఏం కు రిక్వెస్ట్..

Imran khan : నా అన్వేష్ వ్యభి*చారం కామెంట్స్… న్యాయం చెయ్యాలంటూ సీఏం కు రిక్వెస్ట్..

Imran khan : బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ను ఇప్పటివరకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇప్పటికే పలువురు పోలీస్ స్టేషన్కు హాజరయ్యి వివరణ ఇచ్చారు. యాంకర్ విష్ణు ప్రియ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటివరకు కేసులు నమోదైన వాళ్ళు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి బెట్టింగ్ యాప్స్ పై వివరణ ఇస్తున్నారు తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


మొన్నీమధ్య అన్వేష్ ఇమ్రాన్ పై దారుణంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. తాజాగా ఒక సెంటిమెంట్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డికి వీడియో ట్యాగ్ చేస్తూ అన్వేష్ పై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

“అన్వేష్ తన తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని.. అందుకోసం అతడిపై చర్యలు తీసుకోవాలని వీడియోలో పేర్కొన్నాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ నా అన్వేష్‌ చేసిన వ్యాఖ్యల్ని వీడియోలో చూపిస్తూ ఇమ్రాన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను తప్పు చేసి ఉంటే తనపై విమర్శలు చేయొచ్చునని కానీ ఏ తప్పు చేయని తన తల్లిపై ఇలా మాటలతో అసభ్యంగా దూసేస్తూ మాట్లాడడం తప్పు అని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో మీరు మాట్లాడిన మాటలు వింటాము స్త్రీలని గౌరవించని వారిని ఎవరినైనా శిక్షిస్తామని మీరన్నారు.. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాంటి వారిపై మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఇమ్రాన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు”..


చట్టాన్ని గౌరవిస్తామని, కానీ డబ్బుకోసం, వ్యూస్ కోసం తన తల్లిని దారుణంగా తిట్టిన అన్వేష్ పై కేసు నమోదు చేయాలని కోరాడు ఇమ్రాన్ ఖాన్ . అన్వేష్ పై కూడా చాలా ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని, అతడిపై కడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి…

ఈ బెట్టింగ్ యాప్స్ ను తమ ప్రయోజనాలకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు పంపిస్తూ విచారణకు హాజరుకావాలని కోరుతున్నారు ఇప్పటివరకు చాలామంది హాజరయ్యారు. ఇందులో విజయ్ దేవరకొండ రానా పేర్లు కూడా వినిపించడంతో విజయ్ దేవరకొండ టీం దీనిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే మరి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని పోలీసులు అంటున్నారు త్వరలోనే వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తామని వారు చెప్తున్నారు..

?igsh=ZWszN2o5N2dqdGh5

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×