BigTV English

Cricketers – Betting Apps case: బెట్టింగ్ యాప్ లు… క్రికెటర్ల పై చర్యలు ఉండవా?

Cricketers – Betting Apps case: బెట్టింగ్ యాప్ లు… క్రికెటర్ల పై చర్యలు ఉండవా?

Cricketers – Betting Apps case: యువతను తప్పుదారి పట్టిస్తున్న బెట్టింగ్ మాఫీయాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్, సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారు ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని నోటీసులు పంపి మరీ విచారణ చేస్తున్నారు పోలీసులు.


Also Read: Riyan Parag: సంజూకు షాక్… రాజస్థాన్ కెప్టెన్ గా కుర్రాడు ?

ఈ బెట్టింగ్ యాప్స్ లో ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరూ నమ్మకూడదని, వీటి బారినపడి మోసపోయి, ఆర్థికంగా నష్టపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని.. అందుకే బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక రేపటినుండి భారతదేశంలో ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ క్రీడాభిమానులతో పాటు బెట్టింగ్ రాయుళ్లకు కూడా సందడి కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ టోర్నీ మూగిసేలోపు బెట్టింగ్ బారినపడి చాలామంది అమాయకులు తమ ప్రాణాల పైకి తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝలిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే యూట్యూబర్లు, సినీ హీరోలు, హీరోయిన్లకు కూడా నోటీసులు అందించి విచారణ చేపడుతున్నారు. ఐతే టీమిండియా దిగ్గజా ఆటగాళ్లు అయిన సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలతో పాటు పలువురు బడా క్రికెటర్లు, ఇతర దేశ ప్లేయర్స్ కూడా పలు అధికారిక ఫ్యాంటసీ క్రికెట్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు.

కాగా వారిపై కూడా ఇటువంటి చర్యలు తీసుకునే దమ్ముందా..? అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ జరిగే సమయంలో యాప్స్ వేదికగానే కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే దిగ్గజ క్రికెటర్లు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ కి చట్టబద్ధత ఉందా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే.. మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోరకంగా ఉన్నాయి. పలు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కొన్ని చట్టాలు చేసింది.

 

అయితే క్రికెటర్లు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ లకు కేంద్ర ప్రభుత్వ పరిమిషన్లు ఉంటాయట. ఇక కేంద్రం ఈ ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లను అడ్డుకునేందుకు ఐటీ చట్టం 2000, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ నిబంధనల ద్వారా కేసులు నమోదు చేస్తోంది. 2023వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 కి పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ ని నిషేధించింది. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఈ యాప్స్ ని ప్రమోట్ చేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

Big Stories

×