EPAPER

Pavitra: ముగ్గురు పవిత్రలు.. కన్నడ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించారా.. ?

Pavitra: ముగ్గురు పవిత్రలు.. కన్నడ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించారా.. ?

Pavitra: పవిత్ర.. ఈ మధ్య ఈ పేరు ఇండస్ట్రీని కలవరపెడుతుంది. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అసలు ఈ పేరులోనే ఏదో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అందులోనూ ఈ పవిత్ర పేరు ఉన్న నటీమణుల వలన ఒక ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అయ్యింది. అసలు ఆ ఇండస్ట్రీలోనే ఇలాంటి వారు ఉన్నారా.. ? ఈ పేరు పెట్టుకున్నవారు మాత్రమే ఆ ఇండస్ట్రీలో ఉన్నారా.. ? అనుమానం రాకమానదు. ముగ్గురు పవిత్రలు.. కన్నడ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించారు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అసలు వారు ఎవరు.. ? ఏం చేయడం వలన వారి పేర్లను నెటిజన్స్ గుర్తు పెట్టుకున్నారు అనేది తెలుసుకుందాం.


పవిత్రా లోకేష్: ఈ పేరు గత ఏడాది ఏ రేంజ్ లో వినిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్కటి చీరకట్టు.. నుదిటిన నిండైన బొట్టు.. చూడగానే దండం పెట్టాలి అనిపించే రూపం. తెలుగులో స్టార్ హీరోలకు తల్లిగా ఆమె నటిస్తే.. అబ్బా.. మా ఇంట్లో కూడా ఇలాంటి తల్లి ఉండాలని కుర్రాళ్లు ముచ్చటపడేవారు అంటే అతిశయోక్తి కాదు. కానీ, అమ్మడి నిజ స్వరూపం తెలిసాకా.. అసలు ఏంటి ఈమె అని తిట్టిపోస్తున్నారు. సాధారణంగా ఏ ఆడది అయినా కోరుకొనేది చక్కని సంసారం, బిడ్డలు. కానీ పవిత్ర మాత్రం 45 ఏళ్ళ వయస్సులో మరోసారి ప్రేమను కోరుకున్నది. అది కూడా 50 నిండిన నరేష్ తో. దానికి ఆమె చేసిన పనులు ఎంతోమందికి చిరాకు తెప్పించాయి.


ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని చెప్తారు కానీ, ఇలాంటివి చూసినప్పుడు అసలు వీరిది ప్రేమేనా అనే అనుమానం కలుగక మానదు. ఎన్నో మంచి సినిమాల్లో అంటించి మెప్పించిన పవిత్ర .. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి నరేష్ తో ప్రేమాయణం మొదలుపెట్టింది. నరేష్ తన మూడో భార్యతో గొడవపడి మరీ పవిత్రతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ? అసలు చేసుకుంటారో లేదో కూడా తెలియదు. అలా మొదటి పవిత్ర.. కన్నడ పేరును అందరికి పరిచయం అయ్యేలా చేసింది.

పవిత్రా జయరామ్: పవిత్రా లోకేష్ ది ఒక కథ అయితే సీరియల్ నటి పవిత్రా జయరామ్ ది మరో కథ. ఆమె మరణించిన తరువాత ఫేమస్ అయ్యింది. గత నెల కారు ప్రమాదంలో మరణించిన పవిత్ర జయరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రినయని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పవిత్రా భర్తకు విడాకులు ఇచ్చి.. కూతురుతో పాటు మరొక నటుడుతో కలిసి సహజీవనం చేసింది. అతను ఎవరో కాదు చంద్రకాంత్. అతను కూడా పవిత్ర మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వీరిద్దరూ కూడా కన్నడ నుంచి వచ్చినవారే. వీరి లవ్ స్టోరీ త్రినయని సీరియల్ చేస్తున్న క్రమంలోనే స్టార్ట్ అయ్యింది.

ఇంతకు ముందే పవిత్రకు వేరే వ్యక్తితో పెళ్లి అయ్యింది. కానీ, కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయి ఒంటరిగానే ఉంటుంది పవిత్ర. ఆమెకు ఇద్దరు సంతానం. ఇక చంద్రకాంత్ కు కూడా పెళ్లి అయ్యింది. అది కూడా ప్రేమ వివాహం. అతనికి పిల్లలు ఉన్నారు. అయినా భార్యను వదిలేసి పవిత్రతో ప్రేమాయణం నడపడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. చందు సొంత ఇంటికి కూడా వెళ్లకుండా పవిత్రతోనే ఉండేవాడు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని ప్రయత్నించారట. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్లు.. ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే చనిపోయారు. ఇలా రెండో పవిత్ర కూడా కన్నడ పేరును తెలుగులో వినిపించేలా చేసింది.

పవిత్ర గౌడ: ఇక ఈ రెండు అయినా కనీసం ఎవరికి హాని జరగకుండా ఉన్నాయి. ఇక ఇప్పుడు మూడో పవిత్ర అయితే ఏకంగా మర్డర్ చేసేసి పోలీస్ స్టేషన్ లో కూర్చుంది. కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. భార్యను పక్కన పెట్టి దర్శన్, పవిత్రతోనే ఉంటున్నాడు. ఆమెకోసం ఇల్లు కూడా తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహ బంధం కాదని, అక్రమ సంబంధమే అని కన్నడ ఇండస్ట్రీ కోడై కూస్తోంది.

ఇక ఆ నేపథ్యంలోనే రేణుకా స్వామి అనే దర్శన్ అభిమాని.. పవిత్ర గురించి అసభ్యంగా మాట్లాడాడని.. అతడిని చిత్ర హింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు పక్కా ఆధారాలతో బయటపెట్టారు. నటి పవిత్రకు కూడా ముందే పెళ్లయింది. భర్తను వదిలి.. ఆమె దర్శన్ తో సంబంధం పెట్టుకుంది. భార్య కన్నా ఎక్కువగా దర్శన్.. పవిత్రను చూసుకుంటున్నాడు. భార్యను ఏమన్నా పట్టించుకోని ఈ హీరో ప్రియురాలిని ఒక్క మాట అనేసరికి మారుమాట్లాడకుండా చంపేశాడు. ఇలా ఈ పవిత్ర ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించింది.

ఈ ముగ్గురు పవిత్రల్లో ఒకటే కామన్ పాయింట్ ఉంది. పెళ్లి అయ్యి భర్తలను వదిలేసి.. వేరేవారితో పెళ్లి అయినా మగాళ్లను ఎంచుకొని వారితో సహజీవనం చేస్తూ కాలాన్ని గడిపేశారు. అయితే ఈ ముగ్గురు పవిత్రలు బయటపడ్డారు కాబట్టి ప్రపంచానికి తెల్సింది. ఇలాంటి పవిత్రలు  ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ, బయటపడడం లేదు అంతే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఏ పవిత్ర బయటపడుతుందో చూడాలి.

Tags

Related News

Bhumika: కరీనా కపూర్ నా ఛాన్స్ లాగేసుకుంది.. భూమిక షాకింగ్ కామెంట్స్

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Big Stories

×