iPhones Price Drop Alert: దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే ఫోన్లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనేది ఒక డ్రీమ్‌గా ఉంటుంది. కానీ ఐఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే చాలా మంది వీటిని కొనుగోలు చేయాడానికి వెనకుడుగువేస్తున్నారు. అయితే అమెజాన్ యాపిల్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. చాలా ఐఫోన్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్‌లు ఇస్తోంది. వీటిలో ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ఉన్నాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటే వీటి గురించి వివరంగా తెలుసుకోండి.
iPhone 13 5G
ఐఫోన్ 13 అసలు ధర రూ. 59,900. మీరు దీనిని అమెజాన్ నుండి రూ. 7,010 డిస్కౌంట్‌లో కేవలం రూ. 52,890కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో A15 బయోనిక్ చిప్, 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 12MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఈ 5G ఫోన్‌లో ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడానికి అద్భుతమైన స్టెబలైజేషన్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉంది. దీనితో మీరు షేక్ లేకుండా ఫోటోలు, వీడియోలను క్లిక్ చేయగలరు. దీని బ్యాటరీ లైఫ్ కూడా బెటర్‌గా ఉంటుంది.
iPhone 14 Plus
ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 79,900. అయితే మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 17,901 తగ్గింపుతో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో పెద్ద స్క్రీన్ ఉంటుంది. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు, ప్రాసెసర్ A15 బయోనిక్ చిప్. కెమెరా గురించి మాట్లాడితే దీని కెమెరా కూడా ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుంది. కొనీ రాత్రిపూట ఫోటోలు తీయడానికి అదనంగా ఓ పీచర్ ఉంటుంది. దీనివల్ల బెస్ట్ క్వాలిటీ ఫోటోలను తీయొచ్చు.
Also Read: ఇదెక్కడి చవక బేరము.. 5G ఫోన్‌పై హెవీ డిస్కౌంట్.. టాప్ లేపుతుంది!
iPhone 15
ఐఫోన్15 గురించి మాట్లాడితే దీని ధర సుమారు రూ. 79,000. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 67,999 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.1 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో ప్రోమోషన్ టెక్నాలజీ అనే స్పెషల్ ఫీచర్ ఉంటుంది. దీని డిస్‌ప్లే స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది A16 బయోనిక్ చిప్‌ని కలిగి ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన 48MP కెమెరా ఉంది. ఇది ఐఫోన్ 13 కంటే బెటర్ ఇమేజ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది.