BigTV English

Team India T20 World cup 2024: ఆ ఐదుగురు ఆడితే.. టీమిండియాకు తిరుగులేదు!

Team India T20 World cup 2024: ఆ ఐదుగురు ఆడితే.. టీమిండియాకు తిరుగులేదు!

5 Crucial Players can be Gamechangers for India in T20 World Cup 2024: టీమ్ ఇండియాలో గేమ్ ఛేంజర్స్ చాలామంది ఉన్నారు. టీ 20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ ల్లో మాత్రం ఈ ఐదుగురు ఆడితే తిరుగుండదని అంటున్నారు. ఇంతకీ వారెవరంటే విరాట్ కొహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కులదీప్ అని చెబుతున్నారు. ఇంతవరకు కులదీప్ కి అవకాశాలు రాలేదు. కానీ వెస్టిండీస్ లో పిచ్ లు స్పిన్ కి అనుకూలంగా ఉండటంతో తను కీ రోల్ ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఒకరకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ కి సరైన స్పిన్నర్ లేకపోవడం వల్లే సూపర్ 8 కి చేరలేకపోయిందని అంటున్నారు. అందుకని ఇప్పుడు వెస్టిండీస్ లో జరగబోయే పిచ్ లపై స్పిన్నర్లు చక్రం తిప్పే అవకాశాలున్నాయి.

ఇంక టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి కీలకమైన మెగా టోర్నమెంటులో తను ఇలా అవుట్ కావడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి. అయితే ఆట పట్ల, దేశం పట్ల తన చిత్తశుద్ధి, అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. కానీ తను ఆడితే మాత్రం భారత్ కి తిరుగుండదని అభిమానులు ఆశిస్తున్నారు.


టీమ్ ఇండియాలో సెలక్ట్ కావడమే మిరాకిల్ గా చెప్పుకునే రిషబ్ పంత్ మాత్రమే లీగ్ దశలో బాధ్యతాయుతంగా ఆడాడు. అంటే ఒక మ్యాచ్ లో రోహిత్ ఆడాడు, రెండిట్లో అయిపోయాడు. సూర్య కూడా అంతే ఒకటి ఆడి, రెండింట్లో అయిపోయాడు. కానీ రిషబ్ మాత్రం అన్ని మ్యాచ్ ల్లో స్టాండ్ ఇచ్చాడు. కచ్చితంగా తనపై టీమ్ ఇండియా ఆశలు పెట్టుకుందనడంలో సందేహం లేదు.

సూర్యకుమార్ యాదవ్ క్రీజులో కానీ నిలదొక్కుకున్నాడా? ఆరోజు ప్రత్యర్థులకు చాకిరేవు తప్పదు. స్టాండ్ కావడమే కావాలి. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ఇక నుంచి అమెరికాపై ఆడినట్టు అన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుందాం.

Also Read: సూపర్ 8.. టీమ్ ఇండియాకు కఠిన సవాళ్లెన్నో!

జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అందుకని రాబోయే మ్యాచ్ ల్లో తన పాత్ర కీలకం కానుంది.

ఇక మిగిలిన వాళ్లలో ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. నిలకడగా ఆడుతున్నాడు. ఇక శివమ్ దుబె చివరి మ్యాచ్ లో కొంచెం టచ్ లోకి వచ్చాడు. అర్షదీప్ నమ్మదగ్గ బౌలర్ గా ఉన్నాడు. ఆపద్భాందవుడిలా మారిపోయాడు.

ఇక ఎటొచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరికి ఇక్కడ స్పిన్ పిచ్ లు కలిసివచ్చేలా ఉన్నాయి. వీరు విజృంభిస్తే…భారత్ కి తిరుగుండదని అంటున్నారు. మరి మన మొనగాళ్లకు మొనగాళ్లు, రికార్డుల రారాజులు ఏం చేస్తారో చూడాల్సిందే.

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×