E-Paper
Advertisement

Actress Sunaina: అమ్మోరు సినిమాలో అమ్మవారుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా..?

Actress Sunaina: అమ్మోరు సినిమాలో అమ్మవారుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా..?
Advertisement

Actress Sunaina: దండాలు .. దండాలు అమ్మోరు తల్లో.. శతకోటి దండాలు మా అమ్మ తల్లో .. ఈ సాంగ్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మర్చిపోరు. ఇక ఆది శక్తిని నేనే.. అన్నపూర్ణను నేనే అంటూ అమ్మోరు సినిమాలో అమ్మవారిగా భయపెట్టిన చిన్నారిని కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అంతలా ఆ సినిమా ప్రేక్షకుల గుండెల్లో కొలువుండిపోయింది.

పెద్ద పెద్ద కళ్ళు.. వాటికి కాటుక.. పెద్ద జుట్టు.. నుదుటన పెద్ద బొట్టు.. ఒంటినిండా నగలతో ఆ చిన్నారినిచూస్తే.. అచ్చు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ముఖ్యంగా దుష్ట సంహారం చేస్తున్నప్పుడు ఆమె కోపం.. ప్రళయం వస్తుందా.. ? అనేలా ఉండేది. అంతలా ఆ చిన్నారి నటనతో మెప్పించింది. ఇక ఆ చిన్నారి ఎవరో కాదు .. మన తెలుగమ్మాయి సునైనా.

Advertisement

Also Read: Dhanush: ధనుష్ రెండో పెళ్లి.. వధువు ఎవరంటే.. ?

Advertisement

బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన సునైనా ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. బేబీ షాలిని తరువాత అంతగా బాలనటిగా అలరించింది సునైనానే. ఇక 1995లో లో విడుదలైన అమ్మోరు సినిమా ఆమెకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య , సురేష్ జంటగా నటించగా.. పెద్ద అమ్మవారిగా రమ్యకృష్ణ గెస్ట్ పాత్రలో కనిపించగా.. చిన్న అమ్మవారుగా సునైనా నటించింది. ఈ సినిమాకు సునైనా అవార్డులను కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం తరువాత బాల రామాయణం తో పాటు పలు సినిమాల్లో నటించింది.

ఇక పెళ్లి తరువాత సునైనా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక యూట్యూబ్ వచ్చాకా .. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనే సిరీస్ తో మళ్లీ అభిమానులకు దగ్గరయింది. ఈ వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయి అంటే.. ఎక్కడకు వెళ్లినా ఆమెను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ కదా అని పిలుస్తున్నారు. ఇక ఈ వీడియోయూ హిట్ అయ్యాక ఆమె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా కొనసాగుతోంది. ఓ బేబీ, సేవ్ ది టైగర్స్ తో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పిస్తుంది. ఇక చాలామంది ఓ.. అమ్మవారు.. ఈమెనేనా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×