BigTV English
Advertisement

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..!

Rachakonda CP Press Meet: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


పీర్జాదిగూడలో నాలుగు రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అయితే ఆమెకు సంబంధించినన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. అయితే ఇప్పటికే ఈ ముఠా 16 మంది చిన్నారులను విక్రయించినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభరాణి, సలీం, స్పప్నలను అరెస్టు చేశాం అని సీపీ చెప్పారు. సంతానం లేని వారికి వీరు పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.


Also Read: ఆర్టీవో ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని భారీ నగదు

ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముఠాకు సంబంధించి ఢిల్లీ, పుణెలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ముఠా తల్లిదండ్రల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు.

Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×