BigTV English

RGV : అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ కావడానికి 3 కారణాలు చెప్పిన ఆర్జీవి.. ఈ ట్విస్ట్ ఏంటో..

RGV : అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ కావడానికి 3 కారణాలు చెప్పిన ఆర్జీవి.. ఈ ట్విస్ట్ ఏంటో..

Ram Gopal Varma : తెలుగు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పిన ఏదోకటి వస్తూనే ఉంటుంది. ముక్కు సూటిగా మాట్లాడటం ఒకటే కాదు. ఆయనకు నచ్చని వ్యక్తుల పై సోషల్ మీడియాలో ట్వీట్ వార్ చేస్తారు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన తల దురుస్తూ కొత్త వివాదాలు తెచ్చుకోవడం ఆయనకు అలవాటే. ఇటీవల వర్మ వార్తల్లో హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అల్లు అర్జున్ ను మరో మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పెట్టిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


కొన్ని నెలలుగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప2 రిలీజ్‌కి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయోనని బన్నీ ఫ్యాన్స్‌ అందోళన చెందారు.. తాజాగా ఏపీ ప్రభుత్వం పుష్ప 2 టిక్కెట్స్ పెంచుకోవచ్చు అనే గుడ్ న్యూస్ ను చెప్పింది. అల్లు అర్జున్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి బన్నీ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చు పెట్టేందుకు రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ వార్ మొదలు పెట్టారు. అల్లు అర్జున్ పై పొగడ్తలతో ముంచేత్తాడు. అంతేకాదు. గ్లోబర్ స్టార్ కన్నా ఎక్కువ బన్నీ రాబోయే ప్లానెట్ స్టార్ అని పేర్కొన్నాడు. ఇక ప్లానేట్ స్టార్ అవ్వడానికి కారణాలను కూడా ట్వీట్ లో రాసాడు. ఆ కారణాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

అల్లు మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ.. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ కావడానికి 3 కారణాలు..


అతని చిత్రం పుష్ప2 భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని క్రేజ్ తో రిలీజ్ కాబోతుంది. మొదటి రోజు దాని కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ యూనివర్స్ యొక్క స్ట్రాటోస్పియర్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా..

ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లానెట్ స్టార్ అని పిలవబడే ఏకైక స్టార్ అల్లు అర్జున్ ఎందుకంటే, బన్నీ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా అని వర్మ అంటున్నారు.

ఇక అలాగే ఆయన సినిమా భారీ బడ్జెట్ తో రూపొందించ బడుతుంది. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదు, అందుకే అతడే నిజమైన టవర్ స్టార్ అంటూ వర్మ ట్వీట్ లో రాసుకొచ్చాడు.నువ్వు బాహుబలి కాదు.. కానీ, స్టార్స్‌ అంతా మెగాబలి’ అంటూ చేసిన పోస్ట్‌ మరో కొత్త వివాదానికి దారితీసేలా ఉంది. బన్నీ ఫాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న వార్‌ కాస్త తగ్గింది అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌ మెగా ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో మరో వార్ జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×