Margashira Masam 2024: మార్గశిర మాసం వచ్చింది. ఈ మాసంలో ఒకే ఒక్క వ్రతం ఆచరిస్తే, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మీకు తెలుసా.. అది కూడా గురువారం ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తే చాలు.. అఖండ ఐశ్వర్యం మీ సొంతం. నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించి అమ్మా తల్లీ శరణు శరణు అంటే చాలు.. ఏకంగా కనకమహాలక్ష్మి దేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్రతం ఎలా ఆచరించాలనే ప్రశ్నకు సమాధానం మీ ముందుకు..
కార్తీకమాసం అనంతరం మార్గశిర మాసం వస్తుంది. ఈ మాసం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ‘మాసనం మార్గశీర్షోహం’ అన్నారు. అంటే 12 మాసాల్లో మార్గశిర మాసం సాక్షాత్తు విష్ణు స్వరూపమని, 12 మాసాలకు శిరస్సు వంటిది మార్గశిర మాసమంటూ భోదించారు. ఇంతటి పవిత్ర మాసంలో భక్తితో దైవసాధన చేస్తే కలిగే ప్రయోజనం ఊహకు అందనిదే. అంతేకాదు దేవతలకు బ్రాహ్మి ముహూర్తకాలం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అందుకే ఈ మాసం కూడా అన్ని మాసాలలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
మార్గశిర గురువార వ్రతం
ఈ మాసంలో వచ్చే గురువారాలలో వ్రతం చేయటం సాంప్రదాయంగా వస్తోంది. గురువారమే ఎందుకంటారా.. ఈ వారాన్ని లక్ష్మీవారమని సంభోధిస్తారు కాబట్టి. మార్గశిర గురువారాల్లో వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానంలో కనకమహాలక్ష్మి దేవికి విశేషంగా భక్తులు ఉపచారాలు చేస్తుంటారు. అమ్మవారికి సంబంధించి ఎన్నో పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, వారంతా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ వ్రతం ఆచరిస్తే, వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందన్నది ప్రతీక.
వ్రతాన్ని ఇలా ఆచరించాలి
ఇంట్లో ఒక ప్రదేశాన్ని శుభ్రపరచి పీఠం ఏర్పాటు చేసి పసుపు, కుంకుమలతో ముగ్గు వేసి అమ్మవారి చిత్రపటాన్ని లేదా అమ్మవారి విగ్రహాన్ని ఉంచాలి. ఉపచారాలతో పూజ చేసి మార్గశిర గురువార కథను విని, అమ్మవారికి ప్రీతికరంగా పాయసం నివేదన చేయాలి. గూడన్న ప్రీత మానస అంటూ లలిత సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించి విశేషంగా వర్ణించారు.
Also Read: Puja Flowers: మీరు పూజించే దేవతను బట్టి పువ్వులను ఎంపిక చేసుకోవాలి, ఏ దేవతకు ఏ పువ్వులు?
ఆ క్రమంలో అమ్మవారికి బియ్యం, బెల్లము, ఆవు నెయ్యి, సుగంధ పరిమళ ద్రవ్యాలు వేసి పాయసం నివేదన చేయాలి. ముత్తైదువులకు తాంబూల దానం చేయాలి. లక్ష్మీప్రదంగా చిరునవ్వుతో ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీ ఆరాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం.. నిండా అప్పుల్లో మునిగారా.. అయితే ఈ గురువారమే వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించండి. – డాక్టర్ శృతి