E-Paper
Advertisement

Rishab Shetty: ఈరోజు నా దేవుడిని కలిశాను.. కాంతార హీరో ఎమోషనల్ పోస్ట్ వైరల్

Rishab Shetty: ఈరోజు నా దేవుడిని కలిశాను.. కాంతార హీరో ఎమోషనల్ పోస్ట్ వైరల్
Advertisement

Rishab Shetty: అభిమానులకే కాదు.. హీరోలకు కూడా తమ అభిమాన హీరోలను కలిసినప్పుడు ఫ్యాన్ మూమెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఒక హీరోను చూసే వారు కూడా ఇండస్ట్రీలోకి వస్తారు. అలా తమను ఇన్స్పైర్ చేసిన హీరోను కలిసినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా అదే ఆనందంలో ఉన్నానని చెప్పుకొస్తున్నాడు.

కాంతార సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. ఆయనే నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. తాజాగా రిషబ్ తన అభిమాన హీరో విక్రమ్ ను కలిశాడు.

Advertisement

ప్రస్తుతం విక్రమ్ తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన బెంగుళూరు వెళ్ళినప్పుడు రిషబ్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక విక్రమ్ ను కలిసిన రిషబ్ ఆనందంతో గంతులు వేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

” నటుడిగా మారే నా ప్రయాణంలో.. విక్రమ్ సర్ ఎప్పుడూ నాకు స్ఫూర్తి. 24 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఈ రోజు నా దేవుడిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా భావిస్తున్నాను. నాలాంటి నటీనటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు. తంగలాన్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ చియాన్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. బెస్ట్ యాక్టర్స్ ఇన్ సింగిల్ ఫ్రేమ్.. సూపర్ ఫోటో అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×