BigTV English

NBK109 Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు.. బాలయ్య కోసం బాబీ ప్లాన్ అదుర్స్..!

NBK109 Update: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు.. బాలయ్య కోసం బాబీ ప్లాన్ అదుర్స్..!

NBK109 Update: నందమూరి బాలకృష్ణ గతేడాది ‘భగవంత్ కేసరి’ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్, శ్రీలీల నటించి మెప్పించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు బాలయ్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘వాల్తేరు వీరయ్య’తో ఒక మంచి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు.


‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది బాలయ్య కెరీర్‌లో 109వ సినిమాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఒకెత్తయితే.. గ్లింప్స్ మరో ఎత్తనే చెప్పాలి. గత కొద్ది రోజుల ముందు మూవీ మేకర్స్ ‘NBK109’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో బాలయ్య మాస్ యాక్షన్ సినీ ప్రియులు, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మాస్ యాక్షన్, వీర మాస్ డైలాగ్స్ సినిమా పై అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అయింది. ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఆ అప్డేట్ తప్పించి ఈ సినిమా నుంచి మరే సర్‌ప్రైజ్ రాకపోవడంతో నందమూరి అభిమానులు డీలా పడిపోయారు. అంతేకాకుండా ఇప్పటి వరకు సినిమాకు టైటిల్ కూడా పెట్టకపోవడంతో అంతా చర్చించుకుంటున్నారు.


Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య.. బాబీ సినిమా టైటిల్.. ఇదిగో ఇదేనట!

మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మేకర్స్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఓ వార్త బయటకొచ్చి వైరల్ అవుతోంది. ఇందులో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగింది.

అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైస్వాల్‌లు బాలయ్యకు జోడీగా నటిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు మరో నటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్‌లు నటిస్తున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×