BigTV English

Ritu Chowdary: డబ్బుల కోసమే ఇదంతా .. శ్రీకాంత్ ను నమ్మి మోసపోయాను..?

Ritu Chowdary: డబ్బుల కోసమే ఇదంతా .. శ్రీకాంత్ ను నమ్మి మోసపోయాను..?

Ritu Chowdary: జబర్దస్త్ నటి రీతూ పేరు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతుంది. ఏపీలోని ఓ ల్యాండ్ స్కామ్ లో ఈ పేరు బయటకు రావడంతో అమ్మడు అసలు యవ్వారం బయటకు వచ్చేసింది. ఇన్ని రోజులు పెళ్లి కాలేదని అందరిని నమ్మించింది. కానీ ఇప్పుడు అడ్డంగా దొరికింది. ఆస్తులు ఉండటంతో పాటుగా ఆమె సీక్రెట్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు వినిపిస్తుంది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ స్కామ్ లో రీతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నిజానిజాలు వెలుగులో రాబోతున్నట్టు సమాచారం. అయితే ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని సంచలన విషయాలను బయట పెట్టేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు రీతూ ఏం చెప్పిందో చూద్దాం..


మీడియాతో మాట్లాడిన రీతూ.. 

జబర్దస్త్ నటి రీతూ చౌదరి అలియాస్ వంగ దివ్య.. ఈ పేరు మీడియాను షేక్ చేస్తుంది. ఏపీలో 700 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ లో ఈమె పేరు బయటకు వచ్చింది. చీమకుర్తి శ్రీకాంత్ కు ఈమెకు నిజంగానే సంబంధం ఉందా? వీరిద్దరికి నిజంగానే పెళ్లయిందా అనే దానికి పై క్లారిటీ ఇచ్చింది రీతూ.. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్యూలో పాల్గొన్న ఈమె అసలు నిజాలను బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చింది.


మీడియా మాట్లాడుతూ.. మీకు నిజంగానే పెళ్లయిందా అంటే ఒకసారి అయ్యింది. కానీ ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే అతనికి దూరంగా వచ్చేసాను నాలుగు నెలలు మాత్రమే మేము కలిసి ఉన్నాము. ఆ తర్వాత విడిపోయాము. విడాకులు గురించి కోర్టులో కేసు నడుస్తుంది అని చెప్పింది. నాకు తెలియకుండానే సంతకాలు తీసుకున్నారు. ఎంత ఉందో కూడా తెలియదని చెప్పారు. శ్రీకాంత్ ను నమ్మి నేను గుడ్డిగా నమ్మాను మోసపోయాను నన్ను ఈ స్కామ్ లోకి లాగకండి ఇంతకు మించి ఏమి చెప్పలేను అని చెప్పింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

రీతూ చౌదరి కేరీర్ విషయానికొస్తే.. 

ఈమె మొదట సీరియల్స్ లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత ఈ ఫేమ్ తో జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి షోల్లో కూడా పనిచేసింది. దీంతో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.. తాజాగా ఈమె ‘వేరే లెవల్ ఆఫీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తాను షోలు, వెబ్ సిరీస్‌లతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నాననీ, తనకు రీసెంట్‌గా రెండు సినిమా ఛాన్స్‌లు వచ్చాయనీ తెలిపింది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×