OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలలో దయ్యాలను రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు కామెడీ కంటెంట్ తో వస్తే మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించే కంటెంట్తో వస్తాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే హారర్ థ్రిల్లర్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో దయ్యం ఏకాంతంగా గడిపితే వదిలేస్తుంది. అటువంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇట్ ఫాలోస్‘ (It Follows). డేవిడ్ రాబర్ట్ మిచెల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో మైకా మన్రో అనే యువతి ప్రధాన పాత్ర పోషించగా, కీర్ గిల్‌క్రిస్ట్, డేనియల్ జొవట్టో, జేక్ వేరీ, ఒలివియా లుకార్డి, లిలీ సెపే సహాయక పాత్రలు పోషించారు. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా $1.3 మిలియన్ బడ్జెట్ తో ఈ మూవీని తీయగా, $23.3 మిలియన్లు వసూలు చేసింది. చాలామంది దీనిని ఆధునిక హర్రర్ క్లాసిక్ థ్రిల్లర్ సినిమాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఈమెకు యూ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతనితో హీరోయిన్ ఒకరోజు రాత్రి ఏకాంతంగా గడుపుటుంది. అక్కడినుంచి ఆమెను ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్తాడు యూ. అప్పుడు ఆమెకు జరిగిన విషయం చెప్తాడు. నాతో ఒక దయ్యం ఉందని, దాని నుంచి తప్పించుకోవడానికి నీతో ఏకాంతంగా గడిపానని చెప్తాడు. ఆ దయ్యం నిన్ను వదిలి పోవాలంటే, నువ్వు వేరొకరితో ఏకాంతంగా గడపాలని చెప్తాడు. ఈ క్రమంలో దయ్యం రావడంతో, ఆమెను అక్కడే ఉంచి పారిపోతాడు. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటుంది. ఇదంతా అబద్ధమని హీరోయిన్ ఫ్రెండ్స్ కొట్టి పారేస్తారు. వీళ్లంతా కలసి ఒక బీచ్ కి వెళ్తారు. అక్కడ దయ్యం హీరోయిన్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత దీనికి పరిష్కారం కనుక్కోవడానికి యూ దగ్గరికి వెళ్తుంది. అతడు ఆమెకు సారీ చెప్పి వేరే వాళ్ళతో గడపడం తప్ప వేరే మార్గం లేదని చెప్తాడు.
ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఒకతను ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు. ఆ దయ్యం ఏం చేయదని హీరోయిన్ కి చెప్తాడు. అయితే ఫ్రెండ్ ఇంట్లోకి దయ్యం వెళ్లడాన్ని హీరోయిన్ చూస్తుంది. వెంటనే అతన్ని అలర్ట్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. అప్పటికే అతను చనిపోయి ఉండటంతో పాటు, ఆ దయ్యం చనిపోయిన అతనితో రొమాన్స్ చేస్తుంటుంది. హీరోయిన్ ఇది చూసి బిత్తర పోయి, అక్కడ నుంచి పారిపోతుంది. చివరికి హీరోయిన్ ఆ దయ్యం నుంచి తప్పించుకుంటుందా? దయ్యం చేతిలో హీరోయిన్ బలవుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘ఇట్ ఫాలోస్’ (It Follows) మూవీని మిస్ కాకుండా చూడండి.