BigTV English

Arshia Goswami Lifts 75Kg Weight: భళా బాలికా భళా.. 9 ఏళ్ల వయస్సులో 75 Kgలు లేపేసావ్ గా..!

Arshia Goswami Lifts 75Kg Weight: భళా బాలికా భళా.. 9 ఏళ్ల వయస్సులో 75 Kgలు లేపేసావ్ గా..!
Arshia Goswami
Arshia Goswami

9 Years of Arshia Goswami lifts the 75Kg Weight: కొందరు చిన్నారులు తమ తెలివి తేటలతో రకరకాల రికార్డులు సృష్టిస్తుంటారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను నిజం చేస్తుంటారు. అలానే తాజాగా హర్యానాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక కూడా అరుదైన ఘనతను సృష్టించి అందర్నీ ఔరా అనిపించింది. ఇంతకీ తను ఏం చేసిందంటే..!


హర్యానాకు చెందిన ఓ బాలిక తొమ్మిదేళ్ల వయస్సులో 75 కేజీల బరువును ఎత్తి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పంచకుల ప్రాంతానికి చెందిన ఆర్శియ గోస్వామి చిన్న వయస్సులో తన పేరిట పలు రికార్డులు సాధించింది.

ఆర్శియ బరువు 25 కేజీల కాగా దానికి రెట్టింపు బరువును లేపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. అయితే తాజాగా ఆర్శియ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. 25 కేజీల బరువు ఉంటూనే 75 కిలోల బరువులు లిఫ్ట్ చేసి భారతదేశంలోనే యంగెస్ట్ డెడ్ లిఫ్టర్ గా పేరు నమోదు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Also Read: భయపెట్టిన బోయింగ్ విమానం.. గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో!

ఆర్శియ చిన్న వయస్సు నుంచే వెయిట్ లిఫ్టర్ గా ఎన్నో ఘనతలు సాధించింది. ఈ రికార్డులు తనకి కొత్త కాదు. 2021లో తాను ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు 45 కేజీల బరువు ఎత్తి అతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లో నిలిచింది. తాను ఎత్తే బరువులకు సంబంధించిన వీడియోలను ఎప్పుటికప్పుడు సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తూ.. నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.

Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Big Stories

×