BigTV English

Naga Chaitanya-Sobhita: మరోసారి అడ్డంగా దొరికిన చై- శోభిత జంట.. ఈసారి ఎక్కడంటే.. ?

Naga Chaitanya-Sobhita: మరోసారి అడ్డంగా దొరికిన చై- శోభిత జంట.. ఈసారి ఎక్కడంటే.. ?

Naga Chaitanya-Sobhita: అక్కినేనినాగ చైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చాకా కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి మంచి హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తండేల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ఇక చై సినిమాల విషయం పక్కన పెడితే.. సామ్ తో విడాకుల తరువాత చై .. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ప్రతిసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నారు. చై ఇంటికి శోభితా వెళ్లి వస్తుంది అని బాలీవుడ్ మీడియా మొట్టమొదటిసారి బయటపెట్టింది. అప్పటి నుంచి అందరి కళ్ళు వీరి మీదనే ఉన్నాయి. ఆ తరువాత వెకేషన్ లో ఇద్దరూ జంటగా కనిపించారు. అది ఫేక్ అం, ఎడిట్ అని అన్నారు.

ఇక ఆ తరువాత ఒక రెస్టారెంట్ లో చై ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగగా వెనుక శోభితా కనిపించింది. ఇవన్నీ కాదు.. ఇక మొన్నటికి మొన్న చై వెళ్లిన ప్లేస్ కే శోభిత వెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ఒకరోజు శోభితా చదివిన బుక్ ను చై చదువుతూ కనిపించాడు. ఇలా ప్రతిసారి వీరు డేటింగ్ లో ఉన్నారు అనేలా ఫోటోలు, వీడియోలు బయటపడుతున్నా.. ఈ జంట మాత్రం అసలు మేము ఒకరికి ఒకరం తెలియదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.


గతంలో ఈ రూమర్స్ గురించి శోభితా అయితే.. తాను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు తనపై వస్తున్న రూమర్లపై ఎందుకు స్పందించాలంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిజమే కాబోలు అని ఈ వార్తలకు చెక్ పెట్టారు అభిమానులు. ఇక తాజాగా ఈ జంట మరోసారి అడ్డంగా దొరికారు. ఈసారి అది ఎడిట్ కాదు.. ఫేక్ కాదు. యూరప్ వెకేషన్ లో ఈ జంట ఎంజయ్ చేస్తూ కనిపించారు.

ఒక వైన్ టెస్ట్ పార్టీలో వీరు కనిపించారు. చై.. తండేల్ లుక్ లోనే ఉండగా.. శోభితా.. మేకప్ లేకుండా సాధారణ యువతిలా కనిపించింది. దీంతో ఈ ఫోటో చూసిన వారందరూ.. ఇంకెందుకు లేట్ .. రిలేషన్ లో ఉన్నారని చెప్పేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారైనా ఈ జంట నోరువిప్పుతారేమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×