E-Paper
Advertisement

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
Advertisement

Jawans Dead: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపానికి తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఏడో దశ ఎన్నికల పోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో జరగనుండగా విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు వడదెబ్బతో మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు మరణించారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో 23 మంది జవాన్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మిర్జాపూర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్బీ లాల్ తెలిపారు. వారిలొ చికిత్స పొందుతూ ఆరుగురు జవాన్లు  మరణించినట్లు వెల్లడించారు.

Advertisement

జవాన్లు తీవ్ర జ్వరం, హై షుగర్ లెవల్స్, హైబీపీ లెవల్స్ తో ఆసుపత్రిలో చేరారని ఆర్బీ లాల్ తెలిపారు. ఈ కారణాలతోనే వారు మరణించారని వెల్లడించారు. బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ఆసుపత్రికి తీసుకురాకముందు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు.

Also Read:  నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల

Advertisement

గురువారం ఔరంగాబాద్ లో అత్యధికంగా 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ కారణంగా సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. రోగులందరికీ చికిత్స అందించినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు అభిషేక్ కుమార్ తెలిపారు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×