E-Paper
Advertisement

Rumours on Samantha : స‌మంత సినిమాల‌పై రూమ‌ర్స్‌.. నిజం లేదు మొర్రో!

Rumours on Samantha : స‌మంత సినిమాల‌పై రూమ‌ర్స్‌.. నిజం లేదు మొర్రో!
Advertisement

Rumours on Samantha : తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర క‌థానాయిక‌గా రాణిస్తోన్న స‌మంత ఇప్పుడు మ‌యోసైటిస్ కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌మంత సినిమాల నుంచి త‌ప్పుకుందంటూ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. దీనిపై స‌మంత ప్ర‌తినిధి వెంట‌నే రియాక్ట్ అయ్యారు. ‘‘స‌మంత బాలీవుడ్ స‌హా కొన్ని ప్రాజెక్టుల నుంచి త‌ప్పుకున్నారంటూ వినిపిస్తున్న వార్త‌ల్లో నిజం లేదు. ప్ర‌స్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

అలాగే ప్ర‌స్తుతం హిందీ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌టానికి ఆరు నెల‌లు ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. మే నుంచి హిందీ సినిమా షూటింగ్‌లో స‌మంత పాల్గొంటారు. ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయ‌టం స‌రికాద‌ని ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల‌కు వివ‌రించాం. ప్ర‌స్తుతం సామ్ ఓకే చేసిన ఏ సినిమా నుంచి ఆమె డ్రాప్ కాలేదు. నెట్టింట వైర‌ల్ అవుతున్న వార్త‌ల్లో నిజం లేదు’’ అన్నారు. ఈ ఏడాది స‌మంత య‌శోద అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే స‌మంత మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ఆమె బెడ్‌పైనే ఉండి య‌శోద సినిమా డ‌బ్బింగ్ కూడా పూర్తి చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×