BigTV English

Hari Hara Veera Mallu: కొత్త ఏడాదిలో ‘హరి హర వీర మల్లు’ ట్రీట్

Hari Hara Veera Mallu: కొత్త ఏడాదిలో ‘హరి హర వీర మల్లు’ ట్రీట్

Hari Hara Veera Mallu:ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ మ‌ధ్య బాగానే ఆలోచిస్తున్నారు. సినిమాలు తీస్తూ, దాని ద్వారా వ‌చ్చే పెట్టుబ‌డినే రాజ‌కీయాల్లో పెట్టి, పార్టీని న‌డిపిస్తున్నాన‌న్న‌ది ప‌వ‌ర్ స్టార్ త‌ర‌చూ చెబుతున్న మాట‌. త‌న రాజ‌కీయ పార్టీ న‌డ‌వాలంటే సినిమాలు చేయాల్సిందే. చేసిన సినిమాలు ఆడాలంటే ఫ్యాన్స్ ఖుషీగా ఉండాల్సిందే. అప్పుడే రెమ్యున‌రేష‌న్లు పెరుగుతాయి. సినిమాల‌కు క‌లెక్ష‌న్లు వ‌స్తాయి. ఈవిష‌యంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు ప‌వ‌ర్‌స్టార్‌. అందుకే ఇంత‌కు ముందులాగా సింగిల్ అప్‌డేట్ కోసం బాబ్బాబూ అని ఆడియ‌న్స్ చేత అడిగించుకోవ‌డం లేదు. పండ‌గ ఉన్నా లేకున్నా పండ‌గ చేసుకోండి అంటూ త‌న అప్‌కమింగ్ సినిమాల‌కు సంబంధించి వ‌రుస‌గా అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు.


భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమాకు పేరు మార్చిన సంగ‌తిని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ అని ఓపెన్‌గానే అనౌన్స్ చేసేశారు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్‌కి హ‌రీష్ శంక‌ర్ వెళ్తే ఆ విష‌యాన్ని ఫొటోలు తీసి మ‌రీ ఓపెన్‌గా చెప్పేశారు. దానికి హ‌రీష్ శంక‌ర్ ట్వీటూ, క్రిష్ రీట్వీటూ రిప్లైయ్ అంటూ ఫ్యాన్స్ కి కాస్త మ‌సాలా దొరికింది. ఇప్పుడు కూడా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆడియ‌న్స్ కి ఓ గిఫ్ట్ ప్యాక్ రెడీ చేస్తున్నార‌ట క్రిష్‌. కాస్ట్యూమ్ డ్రామాల‌ను ప‌ర్ఫెక్ట్ గా తెర‌కెక్కిస్తార‌నే పేరున్న క్రిష్ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రెడీ అవుతోంద‌ట‌. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లులో ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగు ఒక‌టి రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది.
న్యూ ఇయ‌ర్‌కి రెండు రోజుల‌ ముందు అంటే, డిసెంబ‌ర్ 30న గ్లింప్స్ రెడీ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు హ్యాష్‌ట్యాగ్‌లు దుమ్ములేచిపోయేలాగా ట్రెండ్ చేస్తామ‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌. ఇంత‌కీ గ్లింప్స్ లో వినిపించే డైలాగ్ ఏంట‌ని ఆరా తీస్తున్నారు మ‌రికొంద‌రు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×