BigTV English

Sai pallavi : చిరు కంట్లో పడితే అంతే.. సాయి పల్లవి లైఫ్ లో ఇంత చేంజా..?

Sai pallavi : చిరు కంట్లో పడితే అంతే.. సాయి పల్లవి లైఫ్ లో ఇంత చేంజా..?

Sai pallavi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. ఎన్నో కష్టాలను ఎదురుక్కొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అభిమానుల అభిరులను తెలుసుకొని అలాంటి సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు. అలా ఇప్పటికి స్టార్ హీరోగా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ ఉన్న జెనరేషన్ తనపై పలు ట్రోల్స్ లాంటివి చేస్తుంటారు కానీ తానేంటో తన రేంజ్ ఏంటో ఇపుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న దర్శకులని అడిగితే మెగాస్టార్ అంటే అంటే ఏంటో చెప్తారు.. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకు మెగాస్టార్ ఆదర్శంగా నిలిచారు.


కేవలం హీరోలకు మాత్రమే కాదు అటు హీరోయిన్లకు కూడా మెగాస్టార్ ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. గతంలో ఎంతో మంది హీరోయిన్లు మెగాస్టార్ ఇన్స్పిరేషన్తోనే సినిమాల్లోకి వచ్చామని పలు ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇపుడు ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా చేరడం గమనార్హం. సౌత్ లో సాయి పల్లవి హవా ఇపుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. సాయి పల్లవి అంటే డాన్స్ స్క్రీన్ అని అందరికీ తెలిసిందే. తన డాన్స్ తో ప్రేక్షకుల మనసుని కట్టిపడేస్తుంది.

Also Read :
అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ .. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పునకాలే..
అంతే కాకుండా తన డాన్స్ నంబర్స్ కి వందల మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా ఉన్నాయి. ఇంతేనా పలు చిత్రాల్లో కావాలని సాయి పల్లవి డాన్స్ లని ఇరికిస్తున్నారా అనే రేంజ్ లో తనపై కామెంట్స్ కూడా వచ్చాయి. సాయి పల్లవి డాన్స్ కి ఫాన్స్ ఉన్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో చిరంజీవి వల్లే నేను డాన్సర్ గా మారానని ఆమె చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి డాన్స్ లు చూసి నేను కూడా డాన్స్ లు చేసానని అక్కడే తాను డాన్సర్ కావాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుగా తెలిపింది.. గతంలో ఓ ఈవెంట్లో చిరంజీవిని కలిసిన సాయి పల్లవి తన మనసులోని మాటను బయటపెట్టింది అది విన్న చిరు ఎంతగా సంతోషపడ్డాడో అందరికీ తెలుసు. ఇక సాయి పల్లవికి చిరంజీవి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఆమెతో తానే దగ్గరుండి ఓ సినిమాలో అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేయించాలని చిరంజీవి అనుకున్నట్లు తెలుస్తుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి వల్లే ఓ పాన్ ఇండియా మూవీలో సాయి పల్లవికి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో పూర్తిగా తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా చిరంజీవి మనసుని సాయి పల్లవి గెలుచుకుంది కాబట్టి ఇక లైఫ్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదంటూ సాయి పల్లవి ఫాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×