Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన భారీ బడ్జెట్ చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. పుష్ప-2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు గత డిసెంబరులో తెరపడింది. బన్నీ కష్టానికి ఆ సినిమా గొప్ప ఫలితాన్నే అందించింది.. ఇప్పుడు కొత్త సినిమా కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ముందుగా త్రివిక్రమ్ తో మూవీ అనుకున్నాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అట్లీ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.. అయితే అల్లు అర్జున్ ఈ మూవీలో స్పెషల్ గా కనిపించాలని ప్లాన్ లో బన్నీ ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం..
Also Read :పార్లమెంట్ కు వెళ్లబోతున్న గ్లోబల్ స్టార్.. ఎందుకో తెలుసా..?
పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిజానికి ముందుగా త్రివిక్రమ్ తో చెయ్యాలని అనుకున్న కూడా అది కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా తెరపైకి వచ్చింది. కానీ అది కూడా వెంటనే పట్టాలెక్కడం సందేహంగానే కనిపిస్తోంది. బన్నీ ఏమో అసలు ఎవరికీ అందుబాటులో లేకుండా విదేశాలకు ట్రిప్ కు వెళ్లినట్లు ఓ వార్త షికారు చేస్తుంది.
అయితే బన్నీ మళ్లీ తిగిరి వచ్చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ సన్నిహితుడైన బన్నీ వాసును చావా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ప్రెస్ మీట్లో విలేకరులు అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. బన్నీ ఒక స్పెషల్ ట్రైనింగ్ కోసం వేరే దేశానికి వెళ్లినట్లు బన్నీ వాసు వెల్లడించడం విశేషం. అతను కొత్త సినిమాకోసం కొత్తగా కనిపించాలని ట్రైనింగ్ కోసం ఫారిన్ వెళ్లి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ స్పెషల్ ట్రైనింగ్ మతలబు ఏంటో.. అది ఏదైనా పర్టికులర్ సినిమా కోసం తీసుకున్నాడా? లేదా మాములుగా బాడీ కోసం తీసుకున్నాడా? అనేది తెలియలేదు.
అంతేకాదు బన్నీ కొత్త మూవీ గురించి ఆయన క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఆయన టీమ్ అనౌన్స్ చేస్తారని అన్నాడు. పుష్ప-2 రిలీజ్ టైంలో పెద్ద రభస జరిగిన నేపథ్యంలో బన్నీ ఇకపై తన సినిమాల గురించి మీడియాకు సమాచారం ఇవ్వడానికి స్పెషల్ టీంను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత ఓ ఇంటర్వ్యూ లో అన్నాడు. మరి ఈ ఏడాది మిడిల్ లోపు సినిమాను అనౌన్స్ చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ సినిమాలకే బన్నీ ఇంపార్టెంట్స్ ఇస్తాడని గతంలో వార్తలు వినిపించాయి.. మరి ఎలాంటి స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి..