OTT Movie : సైకో కిల్లర్ స్టోరీ లతో వచ్చే సస్పెన్స్ సినిమాలు ప్రేక్షకులను, టెన్షన్ పెట్టిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. చివరి వరకు సస్పెన్షన్ కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను కుర్చీలకి కట్టిపడేస్తాయి. ఇటువంటి సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీలో వరుసగా అమ్మాయిలు హత్యకు గురవుతూ ఉంటారు. హంతకులు అమ్మాయిలపై అఘాయిత్యం చేసి, గోనె సంచిలో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. పోలీసులు హంతకుణ్ణి పట్టుకునే క్రమంలో స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గరుడ పురాణం’ (Garuda Purana). 2023లో విడుదలైన ఈ కన్నడ భాషా క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మంజునాథ్ బి నాగబా దర్శకత్వం వహించారు. సింధు కె ఎం దీనిని నిర్మించారు. ఈ మూవీలో మంజునాథ్ బి నాగ్బా, సంతోష్ కర్కి, దిశా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సిటీలో కొంతమంది అమ్మాయిలు హత్యలకు గురవుతూ ఉంటారు. ఈ అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపేస్తుంటాడు హంతకుడు. ఆ తర్వాత గోనెసంచెలో తీసుకొని వెళ్లి శవాన్ని పడేస్తూ ఉంటాడు. పోలీసులకు ఈ కేసు సవాలుగా మారుతుంది. ఒక క్లూ కూడా దొరక్కపోవడంతో ఆలోచనలో పడతారు పోలీసులు. మరోవైపు నందిని అనే అమ్మాయిని మయూబ్ ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ విషయం ఎవరు ముందు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముందుగా మయూబ్, నందినికి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. అయితే నందిని అన్నయ్య జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. నందిని కి పెళ్లి సంబంధం సెట్ చేస్తాడు ఆమె అన్నయ్య. ఈ విషయం మాట్లాడదామని మయూబ్ను ఒక చోట కలవడానికి వెళుతుంది.
ఈ క్రమంలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సైకో గ్యాంగ్ వస్తుంది. ఈ సైకోలు లారీని నడుపుతూ, ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నందిని వీళ్లకు ఒంటరిగా కనబడుతుంది. మరుసటి రోజు నందిని శవమై కనబడుతుంది. పోలీసులు బాయ్ ఫ్రెండ్ తో కలిపి అందరిని అనుమానిస్తూ ఉంటారు. ఆ దారిలో వెళ్లే లారీలో ఉండే వ్యక్తిని కూడా విచారిస్తారు. ఈ క్రమంలో పోలీసులు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి తెస్తారు. ఆ సైకోలు అమ్మాయిలను చంపింది మేమే అని ఒప్పుకుంటారు. అందులో ఒకడు భార్య తనతో గడపలేదనే కారణంతో ఈ పని చేశానని చెప్తాడు. అయితే నందినిని మేము చంపలేదని షాక్ ఇస్తారు. చివరికి నందినిని చంపింది ఎవరు? సైకోలు అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘గరుడ పురాణం’ (Garuda Purana) అనే ఈ మూవీని చూడండి.