BigTV English

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆగిన సలార్ 2 ..?

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆగిన సలార్ 2 ..?

Prabhas Salaar 2 movie update(Cinema news in telugu): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుత వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను అయితే రాబట్టుకుంది కానీ, రికార్డు కలక్షన్స్ అందివ్వలేకపోయింది. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.


మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక సలార్ సీజ్ ఫైర్ లో కథ మొత్తాన్ని చూపించలేదు. అసలు సిసలు కథ శౌర్యంగ పర్వంలో ఉండనుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు సలార్ 2 సెట్స్ మీదకు వెళ్తుందా.. ? ఎప్పుడెప్పుడు శౌర్యంగ రాజు గా ప్రభాస్ కనిపిస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అయితే అంతలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. సలార్ 2 ఆగిపోయింది. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్- ప్రభాస్ మధ్య క్లాషెస్ రావడంతో సలార్ 2 ను ఆపివేసినట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజా సాబ్ ను కూడా పూర్తిచేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి సలార్ 2 లో అడుగుపెట్టాలన్నది ప్లాన్.


ప్రభాస్ సినిమాలు అయ్యేలోపు ప్రశాంత్ నీల్..సలార్ 2 స్క్రిప్ట్ ను రెడీ చేసి వెన్తనె షూట్ కు వెళ్లిపోవాలనుకున్నాడు. ఎన్టీఆర్ 31 కూడా సలార్ 2 తరువాతనే మొదలుపెట్టాలని అనుకున్నారట. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ 31.. ఆగస్టు నుంచే మొదలుకానుందట. సలార్ 2 ను పక్కన పెట్టి.. నీల్.. తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ 31 మీద పెట్టనున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×