E-Paper
Advertisement

Salaar: నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ‘సలార్’.. ఏయే స్థానాల్లో అంటే..?

Salaar: నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ‘సలార్’.. ఏయే స్థానాల్లో అంటే..?

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ తర్వాత నటించిన లేటెస్ట్ సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియారెడ్డి వంటి స్టార్ నటీనటులు ఇందులో కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి అబ్బురపరచింది. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్‌ను పవర్ ఫుల్ రోల్‌లో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అంతేకాకుండా ప్రభాస్‌పై చిత్రీకరించిన ఎలివేషన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చి తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వీక్షణలతో టాప్‌ ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ఈ సినిమా ఏయే స్థానాల్లో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సలార్’ తెలుగు వెర్షన్ ట్రెండింగ్‌లో నంబర్ 1గా నిలిచింది. తమిళ వెర్షన్ 2వ స్థానం, కన్నడ వెర్షన్ 5వ స్థానం, మలయాళం వెర్షన్ 7వ స్థానంలో ఉన్నాయి. దీనిపై తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×