BigTV English

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభక్తులు అయోధ్యకు పోటెత్తె అవకాశం ఉంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దేశ పర్యాటక ముఖ చిత్రమే మారుతుందని పేర్కొంది.

దేశంలో కొత్త టూరిజం సెంటర్ గా అయోధ్య మారుతుందని దేశ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదికలో పేర్కొంది. భక్తుల రద్దీ అనుగుణంగా కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మించారు. రైల్వేస్టేషన్‌ ను పునరుద్ధరించారు. రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చారు. కొత్త హోటళ్ల నిర్మాణం జరుగుతుందని, ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరుగుతాయని జెఫరీస్ సంస్థ వివరించింది. మౌలిక సదుపాయాల వృద్ధితో టూరిజం పుంజుకుటుందని పేర్కొంది.

రూ.1800 కోట్లతో అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాత్రికుల సంఖ్యకు పెరుగుతారు. ముఖ్యంగా హోటళ్లు, విమానయానం, ఆతిథ్యం, ప్రయాణ అనుబంధ రంగాలకు అభివృద్ధి చెందుతాయి. దేశ టూరిజానికి అయోధ్య న్యూ మోడల్‌గా మారుతుంది. అయోధ్య ఇక నుంచి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించనుందని జెఫరీస్‌ పేర్కొంది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×