E-Paper
Advertisement

Salaar Second Song : సలార్ సెకండ్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్..

Salaar Second Song : సలార్ సెకండ్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్..
Advertisement

Salaar Second Song : ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య వస్తున్న యాక్షన్ మూవీ సలార్ రేపు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ చిత్రం పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రం నుంచి ఒక ఎమోషనల్ సాంగ్ కూడా విడుదల చేయబడింది. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్షిప్ కి గుర్తుగా సాగే ఈ ఎమోషనల్ సాంగ్ అందరి మనసుల్ని తట్టి లేపింది. రేపు మూవీ విడుదల అంటే ఈరోజు ఈ చిత్రం నుంచి మరొక పాటను విడుదల చేయడానికి టీం సిద్ధపడుతుంది.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ మూవీ నుంచి రెండవ పాటను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈరోజు విడుదల కాబోతున్న ఈ పాట అన్ని భారతీయ భాషలలో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ పాట ఎంతవరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇక రేపు సినిమా విడుదల అవుతుంది అనగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. నార్త్ లో సలార్ కు అన్యాయం జరిగింది అని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈరోజు విడుదలైన షారుఖ్ ఖాన్ డంకీ మూవీకి అక్కడ ఎక్కువ థియేటర్లను కేటాయించడంతో.. సలార్ విషయానికి వచ్చేసరికి థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. ఈ విషయంపై సలార్ ఫ్యాన్స్ తో పాటు చిత్ర బృందం కూడా మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

కానీ ప్రస్తుతానికి పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు టాక్.పీవీఆర్, మిరాజ్ థియేటర్స్‌లో ఇప్పుడు బుక్ ఇన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా సాగుతోంది. ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే.. ప్రస్తుతం ఇది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ మూవీ అని ట్రేడ్ పండితులు అభిప్రాయం. ఇప్పటికే ఈ చిత్రం నైజాంలో 60 ,సీడెడ్ లో 24, ఉత్తరాంధ్రలో 17.20, ఇలా ఓవరాల్ వరల్డ్ వైడ్ 345 కోట్లకు పైనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దీంతో ఈ మూవీ టార్గెట్ 347 కోట్లు ఉండబోతోంది అని సమాచారం.

మూవీ నుంచి ఒక ఎమోషనల్ సాంగ్ వచ్చింది ఆ తర్వాత వచ్చేది మంచి డ్యూయెట్ అయి ఉంటుంది అని అందరూ ఆశించారు. అయితే రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ శృతిహాసన్ కి ఈ మూవీలో ఎటువంటి డ్యూయెట్ లేదు అన్న విషయాన్ని కచ్చితంగా తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో వచ్చే పాట రొమాంటిక్ సాంగ్ అయ్యే అవకాశం లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు రాబోయే సాంగ్ ప్రభాస్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండే మంచి హైపర్ సాంగ్ అయి ఉంటుంది అని ఆశిస్తున్నారు. మొత్తానికి ఏ సాంగ్ విడుదలవుతుందో సాయంత్రం నాలుగు గంటలకి తెలిసిపోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×