BigTV English

Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

Land for Jobs Scam | బిహార్ ప్రధాన రాజకీయ పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ (రైల్వే ఉద్యోగానికి బదులుగా భూమి) కేసులో డిసెంబర్ 22న తేజస్వీ యాదవ్ , 27న ఆయన తండ్రి లాలూ యాదవ్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ కేసులో వ్యాపారవేత్త అమిత్‌ కత్యాల్‌ను నవంబర్ నెలలోనే ఈడీ అరెస్టు చేసింది. అమిత్‌ కత్యాల్‌కు లాలూ యాదవ్, తేజస్వీ యాదవ్‌కు సన్నిహిత సంబంధాలుడడంతో ఆయనను అరెస్టు చేసింది. అయితే బిహార్ ఉపముఖ్యమంత్రి
తేజస్వీ యాదవ్‌ను ఏప్రిల్‌ నెలలోనే ఈడీ విచారణ చేసింది. తాజాగా లాలూ ప్రసాద్‌తోపాటు మరోసారి తేజస్వీ కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో ఇద్దరు నాయకుల వాదనలను ఈడీ రికార్డు చేయనుంది.

కాగా, 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగియాని ఆర్జేడీ నేతలపై సీబీఐ అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది.

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ముంబై, బీహార్‌, ఢిల్లీ నగరాలలో మొత్తం 25 చోట్ల ఈడీ సోదాలు చేసింది. తేజస్వీ యాదవ్ నివాసంతో పాటు ఆయన సోదరీమణులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×