BigTV English

Salaar T-Shirts : డార్లింగ్ క్రేజ్ కి మార్కెట్ షేక్.. ఆన్లైన్లో సలార్ టీషర్ట్స్ సందడి..

Salaar T-Shirts : డార్లింగ్ క్రేజ్ కి మార్కెట్ షేక్.. ఆన్లైన్లో సలార్  టీషర్ట్స్ సందడి..
Salaar T-Shirts

Salaar T-Shirts : డార్లింగ్ ప్రభాస్ అంటే టాలీవుడ్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఎనలేని ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత కరెక్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన ఆశలు మొత్తం నెక్స్ట్ చిత్రం సలార్ పై పెట్టుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ హిట్ అవ్వాలి అని ఎంతగానో ఆశిస్తున్నారు.


భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ డైనోసార్ గా హెవీ పబ్లిసిటీ అందుకుంటున్న ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ మూవీతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. పైగా వచ్చేది ప్రభాస్ మూవీ కావడంతో ఇద్దరి కాంబోపై హై రేంజ్ లో బజ్ క్రియేట్ అయి ఉంది. డిసెంబర్ 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదల కాబోతోంది.. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ పై తమ దృష్టి సారిస్తోంది.

ప్రమోషన్ సంగతి మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.హోంబెల్ వెర్సెస్ వెబ్ సైట్‌లో.. ప్రభాస్ సలార్ మూవీ టీషర్ట్స్ అభిమానుల కోసం అందుబాటులోకి వచ్చాయి. మొదటిసారిగా ఓ సినిమాకి ఇంత భారీ క్రేజ్.. భారీ మార్కెట్ ఉండడం మన ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి అనడంలో డౌట్ లేదు. టీ షర్ట్స్ దగ్గర నుంచి హుడీ వరకు చాలా వెరైటీస్ లో సలార్ ప్రింట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి.


ఇక ధర విషయానికి వస్తే 499 తో మొదలై సుమారు 1499 వరకు వివిధ ధరల్లో ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి కేవలం ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతాయి. మరి సలార్ ప్రింట్స్ ఉన్న టీషర్ట్స్ , హుడీస్ కావాలనుకునే అభిమానులు హోంబలే వెర్సెస్ సైట్ లోకి వెళ్లి ఇవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది .మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి స్టాక్ లిమిటెడ్ మరి. విడుదలకి ముందే ఈ చిత్రం పై క్రేజ్ ఎంత ఉంది అనేది ఈ టి షర్ట్స్ సేల్స్ తో ఎంతో కొంత తెలిసిపోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×