E-Paper
Advertisement

Salar VS Dunki : యుద్ధం షురూ కాకముందే డంకీ అస్త్ర సన్యాసం..

Salar VS Dunki : యుద్ధం షురూ కాకముందే డంకీ అస్త్ర సన్యాసం..
Advertisement

Salar VS Dunki : ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. డిసెంబర్ ఆఖరికి రాబోయే రెండు సినిమాలు ఒక ఎత్తు. ఇప్పటివరకు ఈ రెండిటికీ ప్రచారం అలాగే జరిగింది.. పోటీ కూడా అలాగే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. దీనికి తగినట్టు రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వరుసగా హడావిడి చేస్తూ వచ్చాయి. అయితే రిలీజ్ కి కొన్ని రోజుల సమయం ఉంది అనగా ఎందుకో రేస్ లో డంకీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు డంకీ పై సలార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకరోజు తేడాతో విడుదల కాబోతున్న ఈ సూపర్ డూపర్ సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు సినిమాలు పోటా పోటీగా ట్రైలర్ విడుదల చేశాయి. అయితే ట్రైలర్ మరియు అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో సలార్ ఒక అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తుంది. సలార్ జోరు , రికార్డుల ముందు డంకీ ఎక్కడ కూడా కనిపించడం లేదు అన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు.

Advertisement

సలార్ ట్రైలర్ ముందు డంకీ ట్రైలర్ వ్యూస్ కనీసం సగానికి సగం కూడా లేవు. అడ్వాన్స్ బుకింగ్‌ లో కూడా బాద్షా పెద్ద జోరు కనబరచలేకపోతున్నాడు. జవాన్, పఠాన్ చిత్రాలకు వచ్చినంత రెస్పాన్స్ డంకీకి రావటం లేదు అనే విషయం మొదట్లోనే క్లియర్ గా అర్థమవుతుంది. మరొ పక్క సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లో నిజంగానే డైనోసార్ లా దూసుకుపోతుంది.అమెరికా, ఆస్ట్రేలియాతో ..ఇలా పలు ఓవర్సీస్‌ ఏరియాల్లో రికార్డ్‌ స్థాయిలో షోలు సలార్‌ కి పడబోతున్నాయి. మరోపక్క అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో సలార్‌ ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్‌ చేసింది.ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ అడ్వాన్స్ బుకింగ్‌ ని నమోదు చేసుకున్నట్లుగా టాక్.

మరోపక్క షారుక్ డంకీ అడ్వాన్స్ బుకింగ్ లో సలార్ తో పోటీ పడలేకపోతోంది. అందుకే ఇప్పటివరకు బాలీవుడ్ వర్గాలు ఆ లెక్కలను బయట పెట్టలేదు అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సలార్ సెకండ్ ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డంకీ నుంచి కూడా మరో ట్రైలర్‌ ను వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్‌ వస్తే మూవీ పై ఏమైనా బజ్ పెరుగుతుందేమో చూడాలి. ఇక ఈ న్యూస్ కి ఖుష్ అయిన డార్లింగ్ ఫాన్స్..

Advertisement

యుద్దంకు ముందే షారుఖ్‌ అస్త్ర సన్యాసం చేశాడు.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×