BigTV English

Khammam : మంత్రులకు ఘనస్వాగతం.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..

Khammam :  మంత్రులకు ఘనస్వాగతం..  కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..

Khammam : తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరండంతో నేతల హడావుడి కొనసాగుతోంది. ప్రజా క్షేత్రపోరులో సత్తా చాటిన నేతల విజయాలతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జిల్లాలకు మంత్రుల రాకతో సందడి చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఫ్లెక్సీలు పెట్టారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మంకు చెందిన ముగ్గురు మినిస్టర్లు జిల్లాకు వెళ్లడంతో వారికి ఘనస్వాగతం పలికారు.


డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క కీలక పదవిని దక్కించుకున్నారు. అలాగే.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ, చేనేత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర్‌రావు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నారు. దీంతో హస్తం శ్రేణులు వారికి భారీగా ఘన స్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. నాయకన్ గూడెం వద్ద నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రులు.. కొత్తగూడెం వెళ్లి అక్కడ నుండి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×