Samantha Hot kiss: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ ఏమాయ చేసావే ‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఈ సినిమాలో నటించిన నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడి దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి, పెద్దలను ఒప్పించి మరీ 2017లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోయింది. ఇక ఎవరికివారు కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇకపోతే మరోవైపు సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ.. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సమంత..
నవంబర్ 7 అంటే ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ (Varun Dhawan) లీడ్ రోల్ పోషించారు. ఇకపోతే ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా.. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ఇరగదీసారు. ఇకపోతే ఇప్పటివరకు బాగానే ఉన్నా .. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో సమంత లిప్ లాక్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
వరుణ్ ధావన్ తో లిప్ లాక్… రెచ్చిపోయిన సమంత..
ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో కూడా సమంత ఇలానే ఊహించని క్యారెక్టర్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు వరుణ్ ధావన్ తో లిప్ లాక్ లో మునిగిపోయి మరొకసారి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ ముద్దుగుమ్మ సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం చాలా అరుదు. కానీ ఎప్పుడైతే ఓటిటి ఒరిజినల్స్ , వెబ్ సిరీస్ వచ్చాయో ఇక అప్పటినుంచి హాట్ సీన్లు చాలా కామన్ అయిపోయాయి. పెద్దపెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా లిప్ లాక్ సన్నివేశాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా ఇప్పుడు అలాంటి ఒక సీన్లో నటించింది.
నెటిజన్స్ ఫైర్..
మొన్నటి వరకు కూడా లిప్ లాక్ సన్నివేశాలలో సమంత కనిపించినా.. ఈ సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో మాత్రం ఒక అడుగు ముందుకేసి మరింతగా రెచ్చిపోయిందని చెప్పవచ్చు. ఈ సుదీర్ఘ లిప్ లాక్ సన్నివేశం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ సుదీర్ఘ లిప్ లాక్ సన్నివేశాలు సినిమాలలో కామన్ అయిపోయాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లలో మరింత కామన్ గా కనిపిస్తున్నాయి. ఇందులో సమంత లిప్ లాక్ సన్నివేశంలో పూర్తిగా నిమగ్నం అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నేటిజన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదే సమయంలో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సన్నివేశాల వల్లే చైతన్య నీకు దూరమయ్యాడు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Take a closer look on the iconic Samantha Ruth Prabhu’s smooch with Varun Dhawan the way he internationally plays with her thighs is just 💥🥵. #Samantha has finally broken the barriers and unleashed 🛐🫡!#SamanthaRuthPrabhu #Citadel pic.twitter.com/P2egdU6aYY
— 𝐀𝐜𝐭𝐫𝐞𝐬𝐬 𝐒𝐧𝐚𝐜𝐤𝐬 (@actress_snacks) November 7, 2024