Thug Life Teaser: నవంబర్ 7న కమల్ హాసన్ (Kamal Haasan) పుట్టినరోజు. ఎన్నో సినిమాలతో, ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడంలో కమల్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన 70వ ఏట అడుగుపెట్టారు కమల్. అయినా ఇప్పటికీ వైవిధ్యభరితమైన పాత్రలు చేయడానికి, వాటి కోసం ఎంతైనా కష్టపడడానికి కమల్ హాసన్ వెనకాడరు. అలాగే ఒక సినిమాలో ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం ఈ స్టార్ హీరోకు చాలా ఇష్టం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’లో కూడా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ టీజర్ విడుదలయ్యింది. తన పుట్టినరోజు సందర్భంగా ‘థగ్ లైఫ్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు కమల్.
యాక్షన్, సస్పెన్స్
‘థగ్ లైఫ్’ టీజర్ ఓపెన్ చేయగానే ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ తర్వాత టీజర్ స్పీడ్ పెరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు అర్థం కాదు. అప్పుడే కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తారు. సీరియస్ ఫైట్‌తో తన ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ముంబాయ్‌లో శింబు ఎంట్రీ ఇస్తాడు. అలా టీజర్ అంతా కాస్త యాక్షన్, కాస్త సస్పెన్స్‌తో సాగిపోతుంది. ఇప్పటివరకు ‘థగ్ లైఫ్’లో కమల్ హాసన్ ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తిగా, పెద్ద జుట్టుతోనే కనిపించారు. కానీ ఈ రిలీజ్ డేట్ టీజర్ చివర్లో ఒక సస్పెన్స్‌ను దాచిపెట్టారు దర్శకుడు మణిరత్నం.
Also Read: కస్తూరి పై కేస్ ఫైల్..అరెస్ట్ కి రంగం సిద్ధం..!
వచ్చే ఏడాదిలోనే
‘థగ్ లైఫ్’ రిలీజ్ డేట్ టీజర్ చివర్లో కమల్ హాసన్ యంగ్‌గా గడ్డం లేకుండా కనిపిస్తారు. అయితే ఇది ఫ్లాష్‌బ్యాక్ అయ్యిండవచ్చని ప్రేక్షకులకు గెస్ చేస్తున్నారు. మొత్తానికి కమల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తూ ఇందులోనే రిలీజ్ డేట్‌ను కూడా జతచేర్చారు మేకర్స్. 2025 జూన్ 5న ‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి కూడా అడుగుపెట్టింది. అయినా విడుదల తేదీకి అంత సమయం ఎందుకు తీసుకుంటున్నారని ఫ్యాన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ ఏ పోటీ లేకుండా ‘థగ్ లైఫ్’ను ఒంటరిగా రంగంలోకి దించే ప్లాన్ చేశారేమో అని చర్చించుకుంటున్నారు.
టీజర్ బాగుంది
చాలా ఏళ్ల పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కున్న కమల్ హాసన్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా యంగ్ డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకున్నారు. కానీ ఆ రిస్కే ఆయనను కాపాడింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన ‘విక్రమ్’ సినిమాతో కమల్ మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా మణిరత్నం (Mani Ratnam) లాంటి సీనియర్ దర్శకుడితో చేతులు కలిపి స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘థగ్ లైఫ్’ సినిమా నుండి కమల్ లుక్ విడుదలయినప్పటి నుండి ఈ మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే టీజర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అని వారు నమ్ముతున్నారు.