BigTV English

Samantha:షాక్ లో ఫ్యాన్స్.. మగాడిలా మారిపోయిన సమంత..!

Samantha:షాక్ లో ఫ్యాన్స్.. మగాడిలా మారిపోయిన సమంత..!

Samantha:సమంత(Samantha).. ఈమె పేరు చెబితే గత పదేళ్ల ముందు ఎంతోమంది కుర్రకారు తమను తాము మైమరిచిపోయేవారు. ఈ హీరోయిన్ పేరులో ఏ మంత్రం ఉందో కానీ గత దశాబ్దం కింది సినీ ప్రేమికులైతే సమంతని ఎక్కువగా ఇష్టపడేవారు. అలా ఏ మాయ చేసావే(Ee Maya Chesave) సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరిని మాయ చేసి పడేసింది. అందర్నీ తన మత్తులో ముంచేసింది సమంత. అయితే అప్పుడున్న సమంతకి ఇప్పుడున్న సమంతకి చాలా డిఫరెన్స్ ఉంది. సమంత లేనిపోని మాయ రోగాల వల్ల తన కటౌట్ మొత్తాన్ని కోల్పోయింది. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే సమంత (Samantha) ప్రస్తుతం తన అందం పూర్తిగా కోల్పోయింది. ఎంతోమంది సమంత అభిమానులు సైతం ఇదేంటి సమంత బలహీనంగా పీలగా తయారైంది అని ఆమెను చూసి షాక్ అవుతున్నారు. అయితే అలాంటి సమంత తాజాగా ఒక సర్ప్రైసింగ్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం సమంతకి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ సమంత లేటెస్ట్ లుక్ వెనుక ఉన్న ఆ మతలబ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న సమంత..

సమంత తాజాగా షార్ట్ హెయిర్ కట్ తో అచ్చం అబ్బాయి లాగే కనిపిస్తోంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన సమంతను చూసిన చాలామంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు జుట్టుతో కనిపించే సమంత ఈసారి షార్ట్ హెయిర్ తో అచ్చం అబ్బాయిల హెయిర్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో అలా దర్శనమిచ్చింది. అయితే సమంత (Samantha) తన లేటెస్ట్ హెయిర్ స్టైల్ కి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇది చూసిన నెటిజన్స్ మగాడిలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు ..మరి సమంత ఈ లేటెస్ట్ హెయిర్ స్టైల్ ఎందుకు చేయించుకుంది..? ఏదైనా కొత్త సినిమా కోసం ఈ లేటెస్ట్ హెయిర్ స్టైల్ ని ట్రై చేసిందా అనేది తెలియాల్సి ఉంది.


టాలీవుడ్ కి దూరం అయినట్టేనా..?

ఇక సమంత ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేసి, ఎక్కువగా వెబ్ సిరీస్ లకే ప్రాధాన్యత ఇస్తుంది.ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్(Rakth Brahmand) అనే వెబ్ సిరీస్ లో చేస్తోంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం(Ma Inti Bangaram) అనే సినిమా చేస్తోంది. అలా రోజురోజుకి సమంత టాలీవుడ్ కి దూరం అవుతోంది. ఇక ఈమె చివరిగా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) తో కలిసి ‘ఖుషి’ సినిమా (Khushi Movie)లో కనిపించింది. ప్రస్తుతం సమంత సౌత్ ఇండస్ట్రీకి దూరంగా నార్త్ ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటుంది.అలాగే చాలా రోజుల నుండి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో సమంత డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్ లు చాలా రోజుల నుండి వినిపిస్తున్నప్పటికీ సమంత ఖండించకపోవడంతో సైలెంట్ గా ఉందంటే అది నిజమే కావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. రీసెంట్ గా పికిల్ బాల్ టోర్నమెంట్లో రాజ్ నిడిమోరు కూడా సమంతతో కలిసి సందడి చేశారు.అలాగే ఆ టోర్నమెంట్ లో సమంత(Samantha) డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండడమే కాకుండా చేతులు పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో డేటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది అని చాలామంది ఈ ఫొటోస్ కి కామెంట్లు పెట్టారు.

View this post on Instagram

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×