BigTV English

Samantha : సమంత పుట్టిన రోజు.. ఫ్యాన్స్ ఈ రెండు విషయాల్లో హర్ట్..!

Samantha : సమంత పుట్టిన రోజు.. ఫ్యాన్స్ ఈ రెండు విషయాల్లో హర్ట్..!

Samantha :సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో లేదా హీరోయిన్ బర్త్ డే జరుగుతుంది అంటే, ఆ రోజున వారి సినిమాలకు సంబంధించి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదో ఒక వార్త వస్తుందని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.. ఇక సమంత (samantha) లాంటి స్టార్ హీరోయిన్ బర్త్డే అయితే ఊరుకుంటారా..? ఆమె బర్తడే రోజు ఏదైనా స్పెషల్ గా మూవీ మేకర్స్ ప్రకటిస్తారేమో అని ఎదురుచూస్తారు.. ఎప్పటిలాగే సమంత నిన్న తన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా ఆమె మూవీకి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆ రెండు జరగకపోయేసరికి అభిమానులు హర్ట్ అవుతున్నారు. ప్రత్యేకించి రెండు విషయాలలో అభిమానులు హర్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.


అల్లు అర్జున్ మూవీలో సమంత.. నిరాశపరిచిన టీం..

అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ (Allu Arjun), పుష్ప 2 (Pushpa 2) సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా #AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi Maran) ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమా చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. హాలీవుడ్ మూవీలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇందులో సమంత (Samantha) హీరోయిన్గా నటిస్తోందని, ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూశారు. కానీ నిన్న ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు.


వ్యక్తిగత విషయంపై కూడా స్పందించని సమంత..

దీనికి తోడు ఈమె ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో ప్రేమలో ఉందని, వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ పలు రకాల వార్తలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సమంత ఎక్కడికి వెళ్లినా అతడు కూడా ఆమె వెంట వెళ్తున్నారు. పైగా ఇటీవల శ్రీకాళహస్తి, తిరుపతిలో కూడా ఈ జంట దర్శనమిచ్చారు. దీంతో పెళ్లి చేసుకోబోతున్నారని సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సమంతా స్వయంగా ప్రకటించబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. దీంతో ప్రతి ఒక్కరు ఈ రెండు విషయాల కోసం ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూశారు.. కానీ ఈ విషయంపై కూడా స్పందించకపోవడంతో అభిమానులు భారీగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

సమంత సినిమాలు..

ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. అప్పుడెప్పుడో పోస్టర్ విడుదల చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అటు దీనికి సంబంధించిన ప్రకటన కూడా నిన్న వెలువడలేదు. ఇక ప్రస్తుతం ఈమె తన ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. అంతేకాదు ఇందులో నటించింది కూడా.. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసమైనా సమంత మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×