BigTV English

Pakistan family: విశాఖలో పాక్ జాతీయుల ఫ్యామిలీ.. ఇండియా విడిచి వెళ్లలేమంటూ..

Pakistan family: విశాఖలో పాక్ జాతీయుల ఫ్యామిలీ.. ఇండియా విడిచి వెళ్లలేమంటూ..

Pakistan family: పాక్ జాతీయులకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. మంగళవారంతో దాదాపు అందరూ వెళ్లిపోయినట్టే. కాకపోతే విశాఖలో ఓ పాకిస్తానీ ఫ్యామిలీ మాత్రం మొండికేస్తోంది. ఇదే విషయం సిటీ కమిషనర్ దృష్టికి వెళ్లింది. ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.


పహల్‌గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థాన్‌ను అన్నివైపులా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ వ్యవహారంపై మిగతా దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.  ఇండియాలో ఉన్న పాక్ జాతీయులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే లాంగ్ టర్న్ వీసా మీద వచ్చినవారి గడువు (ఏప్రిల్ 27) ముగిసింది.

వైద్య వీసాపై వచ్చిన వారి గడువు మంగళవారంతో (ఏప్రిల్ 29)  ముగియనుంది. సార్క్ వీసాలపై వచ్చినవారు ఇప్పటికే వెళ్లిపోయారు. దాదాపు అన్నివీసాలవారు వెళ్లినపోయిన ట్టే.  విశాఖలో పాకినీయుల ఫ్యామిలీ తాము ఇండియాను వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.


విశాఖలో పాక్ ఫ్యామిలీ మాటేంటి?

పాక్ జాతీయుల ఓ కుటుంబం విశాఖ సిటీలో ఉంటోంది. సోమవారం సిటీ పోలీసు కమిషనర్‌ శంఖ బ్రత బాగ్చీని కలిసింది. ఫ్యామిలీలో భర్త, పెద్ద కుమారుడు పాక్ పౌరసత్వం ఉంది. భార్య, ఆమె కొడుక్కి భారత పౌరసత్వం ఉంది. అనారోగ్యంతో పెద్ద కొడుకు ట్రీట్‌మెంట్ సిటీలో చేయిస్తున్నామని వెల్లడించింది.

ALSO READ: ఆ సమస్య తప్పింది.. ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ఊరట

దీర్ఘ కాలం వీసా కోసం గతేడాది దరఖాస్తు చేశామని తెలిపింది. ప్రస్తుతం ఆ అంశం పెండింగ్‌లో ఉందని తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లలేమని తెలిపింది. మీ కుటుంబం వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని అన్నారు పోలీసు కమిషనర్. అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పాక్ జాతీయులు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఉండకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  ఈ వ్యవహరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. చెప్పాల్సిన విషయాలు చెప్పారు.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విశాఖలో ఉన్న పాక్ ఫ్యామిలీ విషయాలను ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

కేంద్రం నిర్ణయం ఎటు?

ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఆ ఫ్యామిలీకి మినహాయింపు ఇస్తుందా? అన్నదే క్వశ్చన్ మార్క్. ఒక్కరిని అలాంటి ఛాన్స్ ఇచ్చినా మిగతావారు ఉండిపోతారని భావిస్తోంది. మరి కేంద్రప్రభుత్వం నిర్ణయం ఎటో చూడాలి. ఎందుకంటే వైద్య వీసాపై వచ్చినవారికి గడువు నేటితో ముగియనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×