BigTV English

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

సమంత (Samantha) టాలీవుడ్‌కు దూరమై చాలా రోజులు అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం, వరుస ఫ్లాప్‌ల వల్ల టాలీవుడ్ వైపు తొంగి చూడటం లేదు. అయితే, ఇటీవల మలయాళంలో కాకరేపిన హేమా కమిటీ గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో కూడా అలాంటి కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. దీంతో సమంత కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే జానీ మాస్టర్ కేసు విషయంలో మాత్రం ఆమె మౌనంగా ఉండటంతో విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో మహిళా సమస్యలపై అంత శ్రద్ధ ఉంటే.. జానీ మాస్టర్ కేసులోని బాధితురాలికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. ఆమె ఫ్రెండ్ చిన్మయ్ ఇప్పటికే దీనిపై తన వాయిస్ వినిపించింది. మరి సామ్ ఎప్పుడు స్పందని అడుగుతున్నారు.


హేమా కమిటీ.. టాలీవుడ్ లో వేయాలన్న సమంత..

సాధారణంగా సమాజంలో జరిగే విషయాలపై స్పందించని సమంత.. తొలిసారి మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కమిటీ వేయాలి అంటూ తొలిసారి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని పరోక్షంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


జానీ మాస్టర్ కేస్ పై స్పందించని సమంత…

Samantha, Johnny Master
Samantha, Johnny Master

అయితే అప్పుడు తొలిసారి క్యాస్టింగ్ కౌచ్ ఉందని, టాలీవుడ్ లో కూడా హేమా కమిటీ లాంటి ఒక కమిటీ వేయాలని చెప్పిన ఈమె.. ఇప్పుడు అదే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. 14 రోజులపాటు చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అలాంటి ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు అనే వాదన తెరపైకి వచ్చింది.

నాగచైతన్యతో విడాకులు..

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సమంత నాగచైతన్యను ప్రేమించి, పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న తర్వాత వివాదాలు ఆమెను చుట్టుమట్టాయి. ఈమె ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే విడాకులు తీసుకుందని కొంతమంది అంటే, లేదు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులకు నచ్చక విడాకులు ఇచ్చారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేశారు. కారణం ఏదైనా సరే సమంతను చాలామంది టార్గెట్ చేస్తూ రకరకాలుగా కామెంట్ చేశారు.

దీనికి తోడు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డ సమంత ఆ వ్యాధి నుంచి బయటపడడానికి ఎంతో శ్రమించింది. దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇప్పుడు మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న ఈమె, అందులో భాగంగానే “మా ఇంటి బంగారం” అనే సినిమాతో నిర్మాతగా అవతారం ఎత్తింది. మరొకవైపు మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈమె నటించిన సిటాడెల్ (Honey – Bunny) వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.

నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్..

16 సంవత్సరాలు ఉన్న మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని, దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఆమెపై దాడి చేస్తున్నారని, ఆ టార్చర్ భరించలేక తాజాగా బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలు, సెలబ్రిటీలు బాధిత యువతికి అండగా నిలుస్తున్నారు. తప్పు చేసినట్టు జానీ మాస్టర్ కూడా ఒప్పుకున్నారు.

అయితే అప్పుడు హేమా కమిటీపై స్పందించిన సమంత ఇక్కడ నేర నిరూపణ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ విషయంపై స్పందించలేదు అంటూ నెటిజన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై సమంత ఏదైనా స్పందించాలని, అసలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వుందని ఏ కోణంలో ఆమె చెప్పింది అనే విషయాలు తెలపాలి అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మరి దీనిపై సమంత ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×