BigTV English

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

Pant Sorry to Siraj: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా రెండో రోజు పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే బంగ్లా తొలి ఇన్నింగ్స్ ఇలా ప్రారంభం కాగానే.. బుమ్రాకి ఓపెనర్ షద్మాన్ ఇస్లాం వికెట్ పడింది. ఈ క్రమంలో తర్వాత బౌలింగు చేసిన సిరాజ్ కూడా మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బాల్స్ వేశాడు. అలా ఒక బాల్ కి జకీర్ హుసేన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే సిరాజ్ గట్టిగా ఎల్బీకి అప్లై చేశాడు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు.


దీంతో సిరాజ్ దగ్గరలో ఉన్న కెప్టెన్ రోహిత్ వైపు చూసి రివ్యూకి వెళదామని అన్నాడు. తను వెంటనే పంత్ దగ్గరకు వచ్చి అభిప్రాయాన్ని అడిగాడు. దాంతో పంత్ క్లారిటీ ఇవ్వలేదు. అది అవుట్ కాదని, రివ్యూకి వెళ్లవద్దని రోహిత్ కి సూచించాడు. హైట్ కరెక్టుగానే ఉంది కానీ, లెగ్ స్టంప్ మిస్ అయ్యేలా ఉందని తెలిపాడు. దీంతో రోహిత్ రివ్యూ కోరలేదు. కాసేపటికి అది అవుట్ అని తేలింది.

సిరాజ్ చాలా సీరియస్ గా పంత్ వైపు చూశాడు. దాంతో పంత్ సారీ బ్రదర్.. అని సింబాలిక్ గా చూపించాడు. అది మ్యాచ్ లో రెండో వికెట్ అన్నమాట. వెంటవెంటనే వికెట్లు పడుంటే.. పట్టు చిక్కేదని రోహిత్ కూడా చాలా ఫీలయ్యాడు. సిరాజ్ వైపు నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.


Also Read: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

అయితే జకీర్ హుసేన్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. వెంటనే ఆకాశ్ దీప్ బౌలింగులో అవుట్ అయి పెవెలియన్ బాట పట్టాడు. చివరికి మ్యాచ్ లో బుమ్రా 4, ఆకాశ్ దీప్ 2, రవీంద్ర జడేజా 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆ వికెట్ కూడా వచ్చి ఉంటే.. సిరాజ్ ఖాతాలో 3 వికెట్లు అయ్యేవి.

నిజానికి సిరాజ్ చాలా కష్టపడతాడు. కానీ తనకీ మధ్య వికెట్లు పడటం లేదు. కానీ గతంలో ఉన్న ట్రాక్ రికార్డు ద్రష్ట్యా టీమ్ మేనేజ్మెంట్ సిరాజ్ కి పదే పదే అవకాశాలిస్తూ వస్తోంది. అందుకే వికెట్ల కోసం తను కూడా టెన్షన్ పడుతున్నాడు. అవి పడకపోతే, తర్వాత మ్యాచ్ లో ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది.

ఎప్పుడూ అందరితో నవ్వుతూ ఉండే సిరాజ్ ఒక్కసారి పంత్ మీద సీరియస్ అయ్యేసరికి అందరూ షాక్ అయ్యారు. మొత్తానికి 2 వికెట్లు తీసి మళ్లీ రేసులోకి వచ్చాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×