E-Paper
Advertisement

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు
Advertisement

Akash Deep: బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఎన్నో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. టీమ్ ఇండియా అటు బౌలింగు, ఇటు బ్యాటింగులో అద్భుతంగా రాణిస్తూ పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే రెండోరోజు బ్యాటింగ్ చేసేటప్పుడు ఆకాశ్ దీప్ క్రీజులో ఉన్నాడు. తను బంతిని కొట్టి రన్నింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఫీల్డర్ హసన్ మహముద్ బంతితో వికెట్ల వైపు కొట్టాడు. అది అనుకోకుండా ఆకాశ్ దీప్ కి గట్టిగా తగిలింది. తను నొప్పితో కిందపడి విలవిల్లాడాడు.

వెంటనే ఫిజియో థెరపిస్టు పరిగెత్తుకుంటూ వచ్చారు. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అప్పటికి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న కొహ్లీ ఒక జోక్ వేసేసరికి, ఆ పక్కనే ఉన్న గౌతం గంభీర్, రోహిత్ శర్మ పెద్ద పెట్టున నవ్వారు. వీరిని చూసి అక్కడే ఉన్న ఆటగాళ్లందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అసలేం జరిగింది? అన్నట్టు బయట ఉన్నందరూ ఆసక్తిగా చూశారు. మొత్తానికి.. ఈ వీడియో నెట్టింట పెద్ద వైరల్ గా మారింది.

Advertisement

మొత్తానికి మొదటి టెస్టులో టీమ్ ఇండియా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే భారత్ పటిష్ట స్థితిలో ఉండటంతో టీమ్ ఇండియా గెలుపు తథ్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ కూడా హాయిగా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా రివ్యూల విషయంలో కూడా టీమ్ ఇండియా తప్పిదాలు చేస్తోంది. సిరాజ్ బౌలింగులో జకీర్ హుసేన్ ఎల్బీ అయితే, అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఈ విషయంలో పంత్ సూచన మేరకు రోహిత్ ఆగిపోయాడు. అది చివరికి అవుట్ అని తేలింది.

Advertisement

Also Read: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

తర్వాత విరాట్ కొహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. తను ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఈ విషయంలో శుభ్ మన్ గిల్ రివ్యూకి వెళ్లమని చెబుతున్నా.. కొహ్లీ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. కొహ్లీ ఎప్పుడూ రివ్యూకి వెళతాడు. ఈసారి తను కన్ ఫ్యూజ్ అయి ఉంటాడని అంటున్నారు. బాల్ ముందు బ్యాట్ కి తగిలిందా? లేక ప్యాడ్ కి తగిలాక తగిలిందా? అనేది అంచనా వేయలేకపోయాడని అంటున్నారు. అందువల్లనే రివ్యూ తీసుకోలేదని అంటున్నారు.

అయితే తను రివ్యూ తీసుకోకుండా రావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తీరా చూస్తే రివ్యూలో అది అవుట్ కాదు, నాటౌట్ అని తేలింది. దీంతో తల పట్టుకోవడం కొహ్లీ వంతైంది.

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×