E-Paper
Advertisement

Samantha on MYOSITIS : నేనింకా చావ‌లేదు.. ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టేసుకున్న సమంత‌

Samantha on MYOSITIS : నేనింకా చావ‌లేదు.. ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టేసుకున్న సమంత‌
Advertisement

Samantha on MYOSITIS : తెలుగు, త‌మిళ చిత్రాల్లో గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో పాటు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ న‌టిగా త‌న‌కంటూ ఓ స్థానాన్ని, అభిమానుల‌ను సంపాదించ‌కున్న వ్య‌క్తి స‌మంత‌. సినిమాల్లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ ఆమె ఫైట‌ర్. ఎందుకంటే ప్ర‌స్తుతం ఆమె మియోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత క‌ష్టంలోనూ స‌మంత సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆమె టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘యశోద’ నవంబర్ 11న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

అనారోగ్య స‌మ‌స్య‌లున్నా కూడా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఆమె ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఎమోష‌న‌ల్‌గా త‌న ప‌రిస్థితి గురించి చెబుతూ క‌న్నీళ్లు పెట్టేసుకున్నారు సామ్‌. స‌ద‌రు ఇంట‌ర్వ్యూలో మియోసైటిస్ స‌మ‌స్య గురించి వేసిన ప్ర‌శ్న‌కు ఆమె దాచుకోకుండా స‌మాధానం ఇచ్చారు. కొ‘‘న్ని సంద‌ర్భాల్లో అయితే ఓ అడుగు కూడా వేయ‌లేన‌నిపించింది. కొన్ని సార్లైతే ఇంత దూరం వ‌చ్చేశానా అనిపించింది. ఏదేమైనా పోరాడాలంతే. నేను నా ఆరోగ్య ప‌రిస్థితి గురించి చెప్పిన‌ప్పుడు నా ప్రాణాల‌కు హాని ఉందంటూ చాలా మంది రాశారు. అయితే వారు రాసిన‌ట్లు నా లైఫ్ థ్రెట్‌లో లేదు. ప్ర‌స్తుతానికి నేనింకా చావ‌లేదు. క‌ష్ట‌మైన స్టేజ్‌లోనే ఉన్నాను. అయితే పోరాడాలంతే’’ అన్నారు.

Advertisement

యశోద చిత్రాన్ని హరి, హరీష్ అనే డెబ్యూ డైరెక్టర్స్ తెరకెక్కించారు. సరోగసీ లో జరిగే క్రైమ్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సుకుమారన్ సినిమాటోగ్రఫీ అందించగా పులగం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి మాటలను రాశారు.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×