Big Stories

Chinese Smartphone : డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీసే మొబైల్ వచ్చేస్తోంది

- Advertisement -

Chinese Smartphone : ఫొటో అంటే ఎలా ఉండాలి? ఎంత పెద్దగా ప్రింట్ చేసినా పిక్సెల్ అవుట్ కావద్దు. అదిరిపోయే క్వాలిటీ ఉండాలి. వీడియో అంటే ఎలా ఉండాలి? పెద్ద డిజిటల్ టీవీలో చూసినా… కించెత్తు కూడా వీడియో బ్లర్ గా అనిపించొద్దు. అందరూ కోరుకునేవి ఇదే కదా! కానీ ఏం చేస్తారు. చేతిలో ఉన్న సాధారణ స్మార్ట్ ఫోన్ తో తీస్తే ఈ క్వాలిటీ వస్తుందా? అస్సలు రాదుకదా! ఎంతైనా డీఎస్ఎల్ఆర్ కెమెరానే వేరు… మనం తీసిన ఫొటోలు, వీడియోలను చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా! కానీ ఇకముందు ఇలాంటి టెన్షనే అవసరం లేదు. ఎందుకంటే చైనా మొబైల్ కంపెనీ షావోమీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్ 12ఎస్ అల్ట్రా సేమ్ ఇలాంటి టెక్నాలజీతోనే అందుబాటులోకి వస్తోంది. ఆ స్మార్ట్ ఫోన్ కే ఏకంగా డీఎస్ఎల్ఆర్ లెన్స్ ను అమర్చుకునే వెసులు బాటు కల్పిస్తోంది. ఈ ఫోన్ కెమెరాను మిర్రర్ లెస్ కెమెరాగా కూడా మార్చుకోవచ్చు.
ఈ మొబైల్ లో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరాకాగా, మరో రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో ఒకదానితో సాధారణ స్మార్ట్ ఫొన్ కెమెరాలాగా ఫొటోలను తీసుకోవచ్చు. ఇక డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో ఫొటోలు తీయాలంటే మాత్రం ఫోన్ కు లైకా ఎమ్-సిరస్ లెన్స్ అమర్చుకోవాలి. అప్పుడే మిగిలిన లెన్స్ పనిచేస్తాయి. లెన్స్ అమర్చితేనే కెమెరా ఫోకస్ లెంగ్త్ ను మార్చుకునే వీలుంటుంది. దీనితోపాటే ఐఓఎస్, షట్టర్ వంటి వాటిని కూడా మార్చుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త కొత్త ఫీచర్ల కారణంగా… ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ తరహా వస్తువులకు డిమాండ్ తగ్గిపోయింది. ఉదాహరణకు అలారం, వాచ్ లు, ఫొటో కెమెరాలు, వీడియో హ్యాండీ క్యామ్స్, క్యాలిక్యులేటర్స్ వంటివి. ఇక షావోమీ 12 ఎస్ అల్ట్రా కెమెరాతో వస్తున్న కొత్త ఫీచర్లు ఫ్యూచర్ లో సాధారణ డీఎస్ఎల్ఆర్ కెమెరాలకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేకపోలేదంటారు నిపుణులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News