Big Stories

Solar-powered charging station : 8 నిమిషాల్లో 20 కార్లను ఛార్జింగ్ చేసే సోలార్ పవర్ స్టేషన్ ను నెలకొల్పిన చైనా

Solar-powered charging station : టెక్నాలజీలో దూసుకెళ్తున్న చైనా మరో సరికొత్త ఇన్నోవేషన్ తో రికార్డు సృష్టించింది. విద్యుత్ కార్ల వినియోగం చైనాలో భారీగా పెరుగుతోంది. గత సెప్టెంబర్ చివరినాటికి చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్-EVల సంఖ్య దాదాపు ఒక కోటి 20 లక్షలకు చేరింది. భవిష్యత్తు అంతా వీటిదే. డ్రాగన్ కంట్రీతోపాటు పలు దేశాలు విద్యుత్ వాహనాల తయారీపై ఫోకస్ పెట్టాయి. అయితే ఎలెక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగే పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి చాలా దేశాలు పవర్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఎక్కడపడితే అక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయో అలాగన్నమాట. చైనా ఒకడుగు ముందుకేసి విద్యుత్ కు బదులు సహజంగా లభించే సోలార్ పవర్ ను వినియోగించుకుంటోంది. దీనికి సంబంధించిన తొలి ఛార్జింగ్ స్టేషన్ ను నింగ్డే సిటీలో నెలకొల్పింది నెబులా కంపెనీ.
సాధారణంగా సోలార్ పవర్ అంటే చాలా స్లో అనే అభిప్రాయం ఉంది. కానీ డ్రాగన్ కంట్రీ వీటిని పటాపంచలు చేస్తూ సూపర్ పవర్ ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఇది ఎంత ఫాస్ట్ అంటే కేవలం 8 నిమిషాల్లో ఒకేసారి 20 కార్లలో ఛార్జింగ్ చేస్తుంది. ఈ లెక్కన గంటకు 150 కార్లు ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చన్నమాట. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు.
లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్టేషన్ పై సోలార్ ప్యానెల్ లను అమర్చారు. సూర్యుడి నుంచి గ్రహించిన శక్తిని విద్యుత్ గా మార్చి స్టేషన్ లో నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి కార్లలో ఉన్న బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక యాప్ ద్వారా డ్రైవర్లు బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్స్ ని తెలుసుకోవచ్చు.
చైనాలో పెద్ద పెద్ద నగరాలతోపాటు చిన్న పట్టణాల్లోనూ ఈ సూపర్ ఫాస్ట్ సోలార్ పవర్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టేషన్లకు రూపకల్పన చేసిన నెబులా కంపెనీ. వచ్చే ఐదేళ్లలో వీటిని భారీ స్థాయిలో నెలకొల్పాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒక్క నింగ్డే సిటీలోనే వచ్చే ఐదేళ్లలో 50 స్టేషన్లను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంకాగా… వాటిలో 12 స్టేషన్లను 2023 చివరినాటికి పూర్తి చేయనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News