BigTV English

Samantha: నువ్వు గెలిస్తే చూడాలని ఉంది.. నీ కోసం ప్రార్థిస్తున్నాను.. సమంత పోస్ట్ వైరల్

Samantha: నువ్వు గెలిస్తే చూడాలని ఉంది.. నీ కోసం ప్రార్థిస్తున్నాను.. సమంత పోస్ట్ వైరల్

Samantha Post about Winning goes Viral in Social Media: సమంత.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత పలు సినిమాల్లో స్టార్ హీరోల నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగ చైతన్యను మ్యారేజ్ చేసుకున్న సామ్.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు.


ఆ తర్వాత కొన్నాళ్లు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చాలా సిక్ అయిపోయింది. సినిమాలకు చాలా కాలం పాటు బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా, ఫొటోలు, వీడియోల నైనా షేర్ చేయడానికి వెనుకాడదు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఎమోషన్ అవుతూ ఉంటుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమా లేదు. కేవలం బాలీవుడ్‌లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సీటాడెల్’ అనే సిరీస్‌లో మాత్రమే నటిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘నువ్వు గెలవడం చూడాలనుకుంటున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది.


Also Read: సమంత దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నారా.. ఈ పని చేయండి

‘‘నీ హృదయం ఏది కోరుకున్నా.. నువ్వు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నా.. నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు’’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆమె ఐపీఎల్‌ను ఉద్దేశించి పెట్టి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఇవాళ (మే22) రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు గట్టి మ్యాచ్ జరగనుంది.

అందువల్ల ఆమె బెంగళూరు జట్టును ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టిందని కొందరు గుస గుసలాడుకుంటున్నారు. అయితే మరికొందరేమో ఆమె పెట్టిన పోస్ట్‌కు క్రికెట్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ఆమె ఏదో పర్సనల్ పోస్ట్ పెట్టుకున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఇంకొందరేమో ఎవరి గురించి అయి ఉంటుందబ్బా అని తెగ ఆలోచించేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీని గురించి క్లారిటీ రావాలంటే సామ్ నోరు విప్పాల్సిందే.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×