Samantha latest news(Today tollywood news): టైటిల్ చూడగానే.. ఏంటి నిజామా.. సమంత దగ్గర జాబ్స్ చేయొచ్చా అని అంటే.. కచ్చితంగా చేయొచ్చు. అయితే దానికి మీరు ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉండాలి. విషయం ఏంటంటే.. సామ్ హీరోయిన్ గా పీక్స్ లో ఉన్నప్పుడే సాకీ అనే దుస్తుల బ్రాండ్ ను ఓపెన్ చేసిన విషయం తెల్సిందే. తన బ్రాండ్ దుస్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో సామ్ మయోసైటిస్ బారిన పడడంతో సాకీ బ్రాండ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆమె కోలుకోవడంతో తన వ్యాపారాలలో యాక్టివ్ అయ్యింది. ఇక సాకీ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆ ఉద్యోగానికి సరిపడ్డా అర్హత ఉంటే అక్కడ ఇచ్చిన ఈమెయిల్ కు రెజ్యూమే పంపమని కోరింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెంటింగ్ కు సంబంధించిన ఉద్యోగాలు మా సాకీ సంస్థలో ఉన్నాయి.
ఎవరైనా ఆసక్తిగలవారు ఉంటే మెయిల్ చేయమని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే సామ్ వరుస సినిమాలతో బిజీగా మారింది. సిటాడెల్ సిరీస్ ను పూర్తిచేసిన సామ్.. మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఇది కాకుండా ఒక పాడ్ క్యాస్ట్ ను రన్ చేస్తున్న విషయం తెల్సిందే. హెల్త్ గురించి అందులో మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక పక్క యాడ్స్.. ఇంకోపక్క ఫోటోషూట్స్ తో తీరిక లేకుండా గడుపుతుంది. మరి ఈ సినిమాలతో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.