BigTV English

Samantha: డైరెక్టర్ నుంచి మెసేజ్.. సమంత మోములో సిగ్గు మొగ్గలేసిందిగా..!

Samantha: డైరెక్టర్ నుంచి మెసేజ్.. సమంత మోములో సిగ్గు మొగ్గలేసిందిగా..!

Samantha:అక్కినేని కోడలిగా బాధ్యతల నుండి తప్పకున్న తర్వాత సమంత (Samantha) ఎవరికి భయపడను.. ఇక నేను లైఫ్ లో చాలా ఫ్రీ బర్డ్ ని అనేట్టుగా ప్రవర్తిస్తోంది. అయితే చాలా రోజుల నుండి సమంత రెండో పెళ్లి వార్తలయితే వినిపిస్తున్నాయి. కానీ అందులో ఏది నిజం కావట్లేదు. కానీ తాజాగా సమంతకి సంబంధించి ఒక పాపులర్ వెబ్సైట్లో సంచలన వార్త వచ్చింది. అదేంటంటే.. సమంత ఆ డైరెక్టర్ తో ప్రేమలో ఉంది నిజమేనని, త్వరలోనే ఆ డైరెక్టర్ తో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? నిజంగానే సమంత ఆయనతో ప్రేమలో ఉందా?అనేది ఇప్పుడు చూద్దాం..


నాగచైతన్య నుంచి విడిపోయాకే అసలు రూమర్స్ వైరల్..

సమంత (Samantha), నాగచైతన్య(Naga chaitanya) విడాకులకు కారణం ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అంటారు చాలామంది. కానీ నాగచైతన్యనేమో ఈ వెబ్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతారు.ఆ వెబ్ సిరీస్ వల్ల మాకు గొడవలు రాలేదు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే విడిపోయాము అంటారు. ఈ విషయం పక్కన పెడితే, సమంత ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు తీసుకుందో.. అప్పటినుండి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని అంటూ ఉంటారు.అయితే రాజ్ నిడిమోరుకి ఇప్పటికే పెళ్లయింది. కానీ పెళ్లయినా కూడా సమంత అతనితో రిలేషన్ లో ఉంది అని చాలామంది అంటారు.అయితే తాజాగా సమంత రాజ్ తో నిజంగానే ప్రేమలో ఉంది అనేదానికి ఓ వెబ్సైట్లో సంచలన వార్త వినిపిస్తోంది.


ఆ డైరెక్టర్ నుండి మెసేజ్.. సంతోషంలో సమంత..

ఇక అదేంటంటే.. సమంత తాజాగా తమిళంలో ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిందట. అయితే ఆ ఇంటర్వ్యూలో సమంత ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకుందట. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెబుతున్న సమయంలోనే సమంత ఫోన్ కి ఓ ఆడియో మెసేజ్ వచ్చిందని, ఇంటర్వ్యూలో ఉన్నా కూడా సమంత ఆ ఆడియో మెసేజ్ ఓపెన్ చేసి చూడగా ఆ డైరెక్టర్ నుండి మెసేజ్ రావడంతో సమంత మొహం నవ్వుతో వెలిగి పోయిందని సమాచారం. ఇక మెసేజ్ వినడంతోనే సమంత బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి అంటూ రాశారు. అంతేకాదు సమంత బుగ్గలు ఎరుపెక్కిన సమయంలో ఆమెను చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, సమంతకు ఆ డైరెక్టర్ నుండి ఆడియో మెసేజ్ రావడంతోనే సమంత మొహం ఆనందంతో వెలిగిపోయిందని అక్కడ సమంత ని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సమంతకి వెబ్ సిరీస్ లో అవకాశం ఇచ్చినప్పటి నుండే వీరి మధ్య సాన్నిహిత్యం కుదిరిందని, ఇద్దరికీ పెళ్లి అయిందనే విషయాన్ని పక్కన పెట్టి, చెట్టాపట్టాలేసుకొని తిరిగారని, అందుకే సమంతకి నాగచైతన్యకి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారని, వీరి విడాకులకు కారణం ఆ డైరెక్టర్ అని,ఆ డైరెక్టర్ కి పెళ్లి అయినా కూడా సమంతతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారని సమాచారం.

సమంత క్లారిటీ ఇస్తుందా..?

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు సమంతకి డైరెక్టర్ రాజ్ కి మధ్య ఉన్న ప్రేమ నిజమే కావచ్చు.. నిజం లేకపోతే వాళ్లు ఎందుకు అలా ప్రూఫ్స్ తో సహా వార్తలు వైరల్ చేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక డైరెక్టర్ రాజ్ తో సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు సమంత నటిస్తున్న మరో వెబ్ సిరీస్ అయినటువంటి రక్త బ్రాహ్మండ్ కి కూడా రాజ్ నిర్మాతగా చేస్తున్నట్టు తెలుస్తోంది. అలా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనడానికి ఇది కూడా ఓ కారణం అంటూ సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఎఫైర్ వార్తలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×