Abhinav Manohar: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లయిన హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమీన్స్, ట్రావీస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న హైదరాబాద్ జట్టు.. వేలంలో కూడా మంచి కొనుగోళ్లే చేసింది. జట్టుకు అవసరమైన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. చాలా తెలివిగా వ్యవహరించి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Also Read: India Squad: గంభీర్ వర్సెస్ రోహిత్.. BCCI మీటింగ్ లోనే డిష్యూం..డిష్యూం !
ఇలా కొనుగోలు చేసిన ఆటగాళ్లలో అభినవ్ మనోహర్ ఒకరు. ఇతడు 2022లో గుజరాత్ టైటాన్స్ తో ఒప్పందం చేసుకొని ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అభినవ్ మనోహర్ తన బలమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 30 లక్షలతో 2025 మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మనోహర్ కోసం బెంగళూరు, చెన్నై హోరాహోరీగా పోటీపడ్డాయి. దీంతో మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఊహించని ప్రైజ్ మనీతో ఈ యంగ్ ప్లేయర్ ని దక్కించుకుంది.
ఇతడి కోసం ఏకంగా రూ. 3.20 కోట్లు ఖర్చు చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక దేశవాళి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ప్రతినిథ్యం వహిస్తున్న ఈ అభినవ్ మనోహర్.. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. శనివారం రోజు విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 42 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 348 పరుగులు చేసింది.
కర్ణాటక బ్యాటర్లలో రవిచంద్రన్ సమరన్ (101) సెంచరీ తో చెలరేగాడు. కృష్ణన్ శ్రీజిత్ (78), అభినవ్ మనోహర్ (79) పరుగులు చేశారు. అయితే అభినవ్ మనోహర్ 188 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడంతో కర్ణాటక కు కలిసి వచ్చింది. ఈ యంగ్ ప్లేయర్ విధ్వంసకర బ్యాటింగ్ పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతడు చేసిన 79 పరుగులలో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం గమనార్హం.
వన్డే మ్యాచ్ లో టి-20 తరహా ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు అభినవ్. దీంతో మనకు బెస్ట్ ఫినిషర్ దొరికాడు అంటూ హైదరాబాద్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభినవ్ బ్యాట్ లోనే కాకుండా బంతితో కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడు.
Also Read: SA20 league: ఒరేయ్ ఇలా చేశారేట్రా…ప్చ్ అంటూ చిన్నారి రియాక్షన్ అదుర్స్!
SRH IPL 2025 జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. రూ. 3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), అథర్వ తైదే (రూ. 30 లక్షలు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), జీషన్ అన్సారీ (రూ. 40 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1 కోటి), బ్రైడన్ కార్సే (రూ. 1 కోటి), కమిందు మెండిస్ (రూ. 75 లక్షలు), అనికేత్ వర్మ (రూ. 30) లక్ష), ఎషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు).